గత 50 ఏళ్ళ సమస్యకు శాశ్వత పరిష్కారం…
5 నియోజకవర్గాల సమస్యకు శాశ్వత పరిష్కారం.
నెల్లూరు రూరల్ అభివృద్ధికి జిల్లా కలెక్టర్ గారి సహకారం మరువలేనిది.
నెల్లూరు రూరల్ ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేస్తా.
నెల్లూరు, మేజర్ న్యూస్ : నేడు ( 02-10-2026 ) నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని పొట్టేపాళెం గ్రామంలో 6 కోట్ల 54 లక్షల రూపాయలతో నిర్మించిన పొట్టేపాళెం కలుజుపై బ్రిడ్జిని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల, ఐ.ఎస్.ఎస్., నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. ముఖ్య అతిధులుగా పాల్గొన్న సుబ్బారెడ్డి, చలపతి గార్లు. గత 12 ఏళ్ళుగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గా ఉన్నా, గత పదేళ్లలో లేని సంతృప్తి ఈ రెండేళ్లలో సంతృప్తిని ఇచ్చింది. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఈ ప్రాంత ప్రజల చిరకాలకోరిక పొట్టేపాళెం కలుజుపై బ్రిడ్జి. అనేక మంది ప్రజలు ఈ బ్రిడ్జి కోసం నన్ను ప్రశ్నించారు, విమర్శించారు. వారి ప్రశ్నల్లో అర్ధం, నిస్వార్ధం రెండూ ఉన్నాయి. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. నెల్లూరు రూరల్ లో జరిగిన, జరుగుతున్న, టెండర్లు పిలిచిన, అభివృద్ధి పనుల విలువ 966 కోట్ల రూపాయలు. ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధికి సహకరిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, యువనేత నారా లోకేష్ గారికి, జిల్లా మంత్రులు పొంగూరు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి గార్లకు, పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, శాసనమండలి సభ్యులు బీద రవిచంద్ర గారికి ప్రత్యేక ధన్యవాదాలు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 966 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేసే అవకాశం నాకు కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఈ దారిన పోతున్న ప్రజల బాధను నేను కళ్లారా చూసాను. నెల్లూరు జిల్లా చరిత్రలో పొట్టేపాళెం బ్రిడ్జి చరిత్రలో నిలచిపోతుంది. జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల, ఐ.ఎస్.ఎస్. సంవత్సరంలో పూర్తిచేస్తామని చెప్పి, 11 నెలల్లో పొట్టేపాళెం బ్రిడ్జిని పూర్తిచేసి చూపించారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల, ఐ.ఎస్.ఎస్. పై కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.