మూడు చింతలపల్లిలో ఘనంగా గాంధీ జయంతి
గాంధీజీ ఆశయాలను కొనసాగించాలి
ఏఎంసి చైర్మన్ నర్సింలు యాదవ్
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వెంకటేష్
శామీర్‌పేట, మేజర్ న్యూస్ (అక్టోబర్02):
మూడు చింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఉద్దెమర్రి,ఉషార్‌పల్లి,కొల్తూర్ గ్రామాల్లో మహాత్మా గాంధీ 157వ జయంతి వేడుకలను మూడు చింతల పల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దోసకాయల వెంకటేష్ ఆధ్వర్యంలో నిర్వహించగా, ముఖ్యఅతిథిగా ఏఎంసీ చైర్మన్ నర్సింలు యాదవ్ విచ్చేసి గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.....…గాంధీజీ సత్యం, అహింసా మార్గాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ మంద శ్రీనివాస్ రెడ్డి, కౌన్సిలర్లు పులి ప్రభాకర్, గోవర్ధన్ రెడ్డి, దోసకాయల లతా, పెద్దిరెడ్డి శ్రీలత వెంకట్ రెడ్డి,రాజి గళ్ళ లతా భూపాల్,కాంగ్రెస్ నాయకులు ఇర్రి రవీందర్ రెడ్డి, బండి జగన్నాథం,కె. వైద్యనాథ్,తుంకి వెంకటేష్,జెర్రి పోతుల నర్సిములు, కొల్తూర్ బాలకృష్ణ,వీరేశం గుప్తా,నల్లా ప్రభాకర్ రెడ్డి మరియు నాయుకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
రిపోర్టర్ తాటికొండ రవి గౌడ్.