సత్యం.. అహింసే మార్గం.. గాంధీజీకి ఘన నివాళి
చైర్మన్ జాం రవి
మూడుచింతలపల్లి మున్సిపాలిటీలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు
శామీర్‌పేట,మేజర్ న్యూస్ (అక్టోబర్02):
మూడుచింతలపల్లి మున్సిపాలిటీ కార్యాలయ ఆవరణలో మహాత్మా గాంధీ 157 వ జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ జాం రవి అధ్యక్షతన, కమిషనర్ జి.వెంకట గోపాల్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.,..గాంధీజీ దేశానికి చేసిన సేవలను స్మరించుకుంటూ సత్యం, అహింస, శాంతి సిద్ధాంతాలను పాటించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ లు నీరజ్ గౌడ్, నవీన్ నాయక్, అజయ్ కుమార్,పులి ప్రభాకర్,రాజు, గోవర్ధన్ రెడ్డి, డి. లతా, పి. శ్రీలత,ఆర్.లతా, రెవెన్యూ ఇన్స్పెక్టర్ లు రాజేశ్వర్ రెడ్డి,గౌతమి, శానిటేషన్ ఇన్స్పెక్టర్ మోహన్ సింగ్, నాయకులు వెంకట నరసింహ రెడ్డి,శ్రీకాంత్ రెడ్డి,నర్సిములు మున్సిపల్ అధికారులు, సిబ్బంది, బిల్ కలెక్టర్లు, జవాన్లు తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్ తాటికొండ రవి గౌడ్.