BREAKING
సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే మద్దిపాటి ఏపీ ఎన్జీవో జిల్లా కార్యదర్శిగా వి. సురేష్ బాబు భక్తిశ్రద్ధలతో రాజరాజేశ్వరి అమ్మవారికి రాహుకాల పూజలు ఎంపీఎస్సీ కార్యదర్శి మహేంద్ర హర్పాల్కర్ డిప్యుటేషన్ రద్దు, అభ్యర్థుల ఆందోళనకు తలొగ్గిన మహారాష్ట్ర ప్రభుత్వం నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలు.. నెల్లూరు టౌన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు ఎం శ్రీధర్ ప్రజలకు సేవలందిస్తున్న ఆశా, అంగన్‌వాడీ, ఆర్‌పీలు, మహిళా సంఘాల ప్రతినిధుల సేవలు అభినందనీయం : ఎంపీ డీకే అరుణ, జిల్లా కలెక్టర్ ప్రియాంక. పెంచలకోన స్వామివారిని దర్శించుకున్న కర్ణాటక హైకోర్టు జడ్జి పంచాయతీల్లో గ్రామసభలు గాంధీ జయంతి వేల పలు అంగన్వాడి కేంద్రాలు మూత పట్టించుకోని సంబంధిత అధికారులు. *మధిర హెచ్‌పి గ్యాస్‌ కాంపౌస్ లో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు* *మొక్కలు నాటిన డిస్ట్రిబ్యూటర్ దోసపాటి కళ్యాణి* జాతిపితకు ఘన నివాళులు కామంచికల్ కూలీల కన్నీటి కష్టం.. ఖైదీలలో పరివర్తనకు జైళ్లు సంస్కరణ కేంద్రాలుగా మారాలి -- కలెక్టర్ హిమాన్షు శుక్ల కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు జాతీయ శౌర్య పురస్కారం ఇవ్వాలని ప్రధాని కార్యాలయానికి భారత పైలట్ల సమాఖ్య లేఖ పర్వతాలుకు డాక్టరేట్ ప్రదానం చేసిన హైదరాబాద్ విశ్వవిద్యాలయం

సత్యం, అహింస, శాంతి మార్గాలను ఆచరించాలి

Select Suryaa Now
సత్యం, అహింస, శాంతి మార్గాలను ఆచరించాలి

హాస్టల్ సంక్షేమ అధికారి తుల్జారామ్ గౌడ్

మోమిన్‌పేట్, మేజర్ న్యూస్ (అక్టోబర్ 2): మోమిన్‌పేట్ ఎస్సీ బాలుర వసతి గృహంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హాస్టల్ సంక్షేమ అధికారి తుల్జారామ్ గౌడ్ గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ.. మహాత్మా గాంధీ చూపిన సత్యం, అహింస, శాంతి మార్గాలు ప్రతి ఒక్కరి జీవితంలో విలువలుగా నిలవాలని అన్నారు. సత్యం కోసం నిలబడటం మార్పుకు తొలి అడుగు అని, గాంధీజీ ఆశయాలను విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.ఈ సందర్భంగా దివ్య బాబాజీ స్మన్ క్రియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ధ్యానం, యోగా ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. విద్యార్థులు ప్రతిరోజూ యోగా, ధ్యానం చేయడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చని తెలిపారు. లక్ష్మీ ప్రసన్న, పద్మ చెరుకూరి విద్యార్థులకు యోగా కార్యక్రమం, దాని ప్రయోజనాల గురించి వివరించారు. కార్యక్రమంలో హాస్టల్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

రిపోర్టర్ వడ్ల మాణిక్యం చారి.