జర్నలిస్టుల హక్కుల కోసం గాంధీ విగ్రహం వద్ద నిరసన
సూర్య జగిత్యాల ప్రతినిధి: జర్నలిస్టుల హక్కుల పరిరక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించాలని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే) జగిత్యాల జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు చీటీ శ్రీనివాసరావు, బెజ్జంకి సంపూర్ణ చారిలు డిమాండ్ చేశారు.ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) పిలుపు మేరకు గాంధీ జయంతి సందర్భంగా జగిత్యాల మంచినీళ్ల బావి వద్ద గల మహాత్మా గాంధీ విగ్రహం వద్ద జర్నలిస్టులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో ఏ ఓ కిషన్ కు తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు.