మంచి వాళ్ళ గుండెల్లో మహాత్ముడు చిరస్మరణీయం..*మాజీ టౌను అధ్యక్షుడు సత్యవరపు సంపూర్ణం
*మంచి వాళ్ళ గుండెల్లో మహాత్ముడు చిరస్మరణీయం..*మాజీ టౌను అధ్యక్షుడు సత్యవరపు సంపూర్ణం*
*గాంధీ మార్గంలోనే అడుగు ముందడుగు వేద్దాం.. కౌన్సిలర్ ఉదయ జ్యోతి .కాసాని పద్మ*
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట పట్టణ కేంద్రంలో మహాత్మ గాంధీ జయంతిని నిర్వహించారు.మంచి వాళ్ళ గుండెల్లో మహాత్ముడు గాంధీజీ ఎప్పుడు చిరస్మరణీయంగా ఉంటారని, ఉన్మాదుల విమర్శలు ఆయనను ఏమీ చేయలేవని అశ్వరావుపేట బిఆర్ఎస్ నియోజకవర్గ నాయకులు అన్నారు.
అశ్వరావుపేట. మహాత్మా గాంధీ జయంతి . ఈ సందర్భంగా ఆయనకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ స్వతంత్ర పోరాటంలో అందరినీ ముందుకు నడిపి స్వాతంత్రాన్ని సిద్ధింప చేసిన మహనీయుడు మహాత్మా గాంధీ అని అన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న అశ్వరావుపేట నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ నాయకులు కాసాని పద్మ కౌన్సిలర్ ఉదయ జ్యోతి జుజ్జురపు శ్రీరామ్మూర్తి సత్యవరపు సంపూర్ణ ఆరేపల్లి గోవిందు సౌజన్య. మాజీ యువజన విభాగం అధ్యక్షుడు మోటూరి మోహన్ శెట్టిపల్లి రఘురాం వెంకన్న గంగా ఉమేష్ శివ తదితరులు పాల్గొన్నారు.
సూర్య ప్రతినిధి మునీర్ అశ్వారావుపేట