కావలిలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు
వచ్చే ఏడాది గాంధీ జయంతికి ట్రంక్ రోడ్డులో గాంధీ విగ్రహం ఏర్పాటు: ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి
కావలి మేజర్ న్యూస్ : కావలి పట్టణంలోని స్థానికరంకు రోడ్డు కోర్టు సెంటర్ వద్ద ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం వద్ద జయంతి వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి కూటమి నాయకులతో కలిసి గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. అహింసను ఆయుధంగా, సత్యమే మార్గంగా చేసుకుని కోట్లాది భారతీయులలో స్వాతంత్య్ర స్ఫూర్తిని రగిలించిన జాతిపిత మహాత్మా గాంధీ జీవితం యావత్ మానవాళికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు. సత్యం, అహింస, సహనం, మానవత్వం, సామాజిక బాధ్యత వంటి మహోన్నత విలువలను స్వయంగా ఆచరించి ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుడని పేర్కొన్నారు. కావలి ప్రజలలో గాంధీజీ స్ఫూర్తి చిరస్థాయిగా నిలిచేలా వచ్చే ఏడాది (2027) గాంధీ జయంతి నాటికి కావలి ట్రంక్ రోడ్డులో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు అంకితం చేస్తామని ఎమ్మెల్యే ప్రకటింఛారు. బాపూజీ ఆశయాలను నిరంతరం ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, ఎమ్మెల్యే అభిమానులు మరియు పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు పాల్గొని మహాత్మా గాంధీకి నివాళులర్పించారు.