గూడూరులో ఘనంగా జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలు
గూడూరులో ఘనంగా జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలు
గూడూరు అక్టోబరు 2 మేజర్ న్యూస్ ( సూర్య): శుక్రవారం రోజు జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా సర్పంచ్ శ్రీమతి వాంకుడోత్ సునీత కొమ్మాలు నాయక్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన గ్రామ సభలో సర్పంచ్ పాలకవర్గ సభ్యులు మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి,ఘన నివాళులు అర్పించారు.
అనంతరం గాంధీజీ కన్న 'గ్రామ స్వరాజ్యం' కలలను నిజం చేసే దిశగా, కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన వీబీ-జీ రామ్ జీ చట్టంపై సర్పంచ్ మాట్లాడుతూ నూతన చట్టం ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లోని కూలీలకు కల్పించే ఉపాధి పని దినాలను 100 రోజుల నుండి 125 రోజులకు పెంచినట్లు
గూడూరు మేజర్ పంచాయతీ అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతులు, నీటి సంరక్షణ పనులను గ్రామస్థులందరి సమక్షంలో చర్చించి, 'వికసిత్ గ్రామ పంచాయతీ ప్రణాళిక' లో తీర్మానించినట్లు తెలిపారు.
ఈ పథకం కింద చేపట్టబోయే ప్రతి పనిని గ్రామసభ ఆమోదంతోనే ఎంపిక చేస్తామని, బయోమెట్రిక్ హాజరు మరియు నూతన సాంకేతిక విధానాల ద్వారా పనుల నిర్వహణలో పూర్తి పారదర్శకత పాటిస్తామని స్పష్టం చేశారు.
ఈ ప్రత్యేక గ్రామసభలో పాల్గొన్న డివిజనల్ పంచాయతీ ఆఫీసర్ రోజా రాణి.పంచాయతీ గూడూరు ఎంపీ ఓ సత్యనారాయణ. మండల వ్యవసాయ అధికారి మహమ్మద్ అబ్దుల్ మాలిక్.వార్డు సభ్యులు వాంకుడోత్ శ్రీనివాస్. పత్యం వెంకన్న. గార్లపాటి శిరీష. దారావత్ కిషన్. గుగులోత్ వినోద. వాంకుడోత్ భద్రమ్మ., పంచాయతీ కార్యదర్శి తిరుమల. మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు.ఫీల్డ్ అసిస్టెంట్లు, వివిధ శాఖల అధికారులు మరియు గ్రామ ప్రజలు, ఉపాధి హామీ కూలీలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.