BREAKING
ప్రజాదర్బార్ లో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే కోళ్ల గాంధీ జయంతి స్ఫూర్తితో సుందరమైన తిరుపతిని నిర్మిద్దాం సేవా భావంతో మొక్కలు నాటిన ఎమ్మెల్యే ఏలూరి గత 50 ఏళ్ళ సమస్యకు శాశ్వత పరిష్కారం… శ్రీకాకుళంలో అల్యూమినియం స్మెల్టర్ - కిషన్ రెడ్డిని కోరిన రామ్మోహన్ నాయుడు.. రాజం పట్టణం చెవిటి మూగ పాఠశాలలో గాంధీ జయంతి వేడుకలు జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని టీయూడబ్లుజే (ఐజేయూ) నిరసన ముంబై మిథీ నది కుంభకోణం కేసులో బాలీవుడ్ నటుడు డినో మోరియా అరెస్ట్.. రూ. 65 కోట్లకు పైగా స్కామ్! కేసరపల్లిలో అక్రమ మద్యం విక్రయాలపై ఎక్సైజ్ దాడి. గాంధీ విగ్రహానికి నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ , ఎస్పీ , కమిషనర్ ప్రతిరోజూ కేవలం 30 నిమిషాలు నడిస్తే మీ శరీరంలో వచ్చే అద్భుతమైన మార్పులు ఇవే! వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి డాక్టర్ డోలి సత్యనారాయణ గంగపుత్ర పేరును ప్రకటించాలి నెల్లూరు నగరంలో తొలి స్టేడియానికి శ్రీకారం.. స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మంత్రి నారాయణ సత్యం, అహింస, శాంతి మార్గాలను ఆచరించాలి జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక కేంద్ర చట్టాన్ని తేవాలి

కామారెడ్డి నిజాంసాగర్ చౌరస్తాలో చెన్నై షాపింగ్ మాల్, కిసాన్ షాపింగ్ మాల్ ప్రారంభించిన ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్

Select Suryaa Now
కామారెడ్డి నిజాంసాగర్ చౌరస్తాలో చెన్నై షాపింగ్ మాల్, కిసాన్ షాపింగ్ మాల్ ప్రారంభించిన ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్

సూర్య కామారెడ్డి జిల్లా ప్రతినిధి:కామారెడ్డి పట్టణంలోని నిజాంసాగర్ చౌరస్తాలో నూతనంగా ఏర్పాటు చేసిన చెన్నై షాపింగ్ మాల్ మరియు కిసాన్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమాలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్  విశిష్ట అతిథిగా హాజరై షాపింగ్ మాల్స్‌ను లాంఛనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా షబ్బీర్ అలీ  మాట్లాడుతూ.కామారెడ్డి పట్టణం వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో కొత్తగా వాణిజ్య సంస్థలు, షాపింగ్ మాల్స్ ఏర్పాటు కావడం శుభపరిణామమని అన్నారు. స్థానిక ప్రజలకు నాణ్యమైన వస్తువులు, మెరుగైన సేవలు అందుబాటులోకి రావడంతో పాటు పట్టణంలో వాణిజ్య కార్యకలాపాలు మరింత విస్తరించేందుకు ఇలాంటి సంస్థలు దోహదపడతాయని తెలిపారు.కామారెడ్డి పట్టణంలో వ్యాపార, వాణిజ్య రంగం అభివృద్ధి చెందడం వల్ల స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని షబ్బీర్ అలీ పేర్కొన్నారు.యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు స్థానిక వ్యాపారులకు కూడా కొత్త అవకాశాలు ఏర్పడతాయని అన్నారు.చెన్నై షాపింగ్ మాల్, కిసాన్ షాపింగ్ మాల్ యాజమాన్యాలకు అభినందనలు తెలిపిన షబ్బీర్ అలీ..వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులను సరసమైన ధరలకు అందిస్తూ ప్రజల ఆదరణ పొందాలని ఆకాంక్షించారు.కామారెడ్డి పట్టణ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, మౌలిక వసతుల కల్పనతో పాటు వ్యాపార, వాణిజ్య రంగం అభివృద్ధికి అనుకూలమైన వాతావరణం ఏర్పడేలా కృషి చేస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి,  మాజీ డిసిసి అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్ రావు, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఐరేని సందీప్ కుమార్, కామారెడ్డి పిఎసిఎస్ చైర్మన్ గూడెం శ్రీనివాస్ రెడ్డి, డిసిసి ఉపాధ్యక్షులు గంప ప్రసాద్ , ఇప్ప శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోనె శ్రీనివాస్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజా గౌడ్, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు భూమని బాలరాజ్, కౌన్సిలర్లు అంజాద్, కన్నయ్య, వాజిద్, జావిద్, కాళ్ల గణేష్, మజీద్, అఖిల, చిట్టిబాబు,గ్యార సాయిలు, లడ్డు, గంగాధర్, అలీబిన్ అబ్దుల్లా, మహేష్, తాటి ప్రసాద్, భూపతి,లక్కపత్ని గంగాధర్, పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అజ్మత్, మైనార్టీ కాంగ్రెస్ అధ్యక్షులు సిరాజుద్దీన్, ముబషీర్, ఖదీర్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మంత్రి సుమప్రియ, నాగరాణి, శిరీష, నుష్రత్ బేగం, వైద్య కిషన్రావు, ఎన్ ఎస్ యు ఐ జిల్లా నాయకులు డేవిడ్, అనిరుద్, సుఫియన్ తదితరులు పాల్గొన్నారు.