BREAKING
అనంతలో అక్టోబర్ 4న ఆర్‌డీటీ బాలుర క్రికెట్ సెలక్షన్స్ సమస్యలను పరిష్కరించాలని ఎంపీకి విజ్ఞప్తి పీఎం–సూర్యఘర్ పై ప్రత్యేక అవగాహన - 17 నుంచి అక్టోబరు 17 వరకు ‘సేవా సేతు' క్యాంప్ -రూఫ్‌టాప్‌ సోలార్‌ ఏర్పాటుతో విద్యుత్‌ బిల్లుల భారం తగ్గింపు -ఏపీఎస్పీడీసీఎల్ సిఎండి శివశంకర్ లోతేటి వెల్లడి రోడ్డు భద్రతపై వాహనదారులకు ఎల్ కోట పోలీసుల అవగాహన గాంధీ జయంతిని పురస్కరించుకొని .. మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన.. ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. గాంధీ, లాల్‌బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు, రాజమహేంద్రవరం వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఘన నివాళులు ఆమె ఒక రాణి, గొప్ప యువరాజును పెంచారు.. అత్త లక్ష్మి శివకుమార్ గురించి జ్యోతిక భావోద్వేగ వ్యాఖ్యలు! ఉద్యమాలతోనే సమస్యల పరిష్కారం : ఎస్ఎఫ్ఐ బీసీల రిజర్వేషన్ల కోసం కట్టుబడి ఉన్నాం - టీడీపీ జిల్లా అధ్యక్షులు కిమిడి నాగార్జున గాంధీజీ జయంతి వేడుకలలో వి బాలాజీ రెడ్డి టాలీవుడ్‌లో సింగర్ మంగ్లీకి ప్రత్యామ్నాయంగా మారుతున్న జానపద గాయని ప్రభ.. వరుస హిట్లతో జోరు! వార్షికోత్సవ ఏర్పాట్లపై సర్వసభ్య సమావేశం గాంధీజీ చూపిన బాటలో నడవాలి... బూరుగుపల్లి శేషారావు స్వచ్ఛ ఆంధ్ర అవార్డు అందుకున్న ప్రగతి సంస్థ డైరెక్టర్ కెవి రమణ ప్రభుత్వం సాగు రైతులకు పట్టాలి ఇవ్వాలి

గాంధీజీ విగ్రహానికి ఘన నివాళులు...

Select Suryaa Now
గాంధీజీ విగ్రహానికి ఘన నివాళులు...

పొదలకూరు, మేజర్ న్యూస్  :    జాతిపిత మహాత్మా గాంధీ 157వ జయంతిని పురస్కరించుకుని పొదలకూరులో శుక్రవారం గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌ సమీపంలోని గాంధీజీ విగ్రహానికి పలువురు నాయకులు, ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు, వ్యాపారవేత్తలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో పొదలకూరు మండల అధ్యక్షుడు, పీఏసీఎస్‌ చైర్మన్‌ తలచీరు మస్తాన్‌బాబు, పొదలకూరు మండల టౌన్‌ అధ్యక్షుడు బొద్దులూరు మల్లికార్జున నాయుడు, ఏఎంసీ డైరెక్టర్‌ పిన్నేల ప్రభాకర్, ఎస్‌పీఎస్‌ఆర్‌ నెల్లూరు రూరల్‌ ఆర్యవైశ్య సంఘం గౌరవ సలహాదారు అమర్తలూరు చెంచయ్య, తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నాయకుడు ఆకులూరు విజయ్‌కుమార్, పొదలకూరు మండల ట్రేడ్‌ సెల్‌ కమిటీ అధ్యక్షుడు గుఱ్ఱం మీరామధు, ట్రేడ్‌ సెల్‌ కమిటీ ఉపాధ్యక్షుడు అనిశెట్టి వీరేంద్ర, తన్నీరు సురేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మహాత్మా గాంధీ దేశానికి అందించిన సేవలను, సత్యం, అహింస, శాంతి, స్వావలంబన వంటి ఆయన ఆశయాలను స్మరించుకున్నారు. గాంధీజీ చూపిన సత్యం, అహింస మార్గాలు నేటి సమాజానికి కూడా ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. అక్టోబర్‌ 2న గాంధీ జయంతిని దేశవ్యాప్తంగా స్మరించుకోవడంతో పాటు అహింస, శాంతి, సామరస్య విలువలను ఆచరణలో పెట్టాల్సిన అవసరం ఉందని పలువురు పేర్కొన్నారు.అనంతరం కార్యక్రమానికి హాజరైన వారితో పాటు స్థానికులకు బిస్కెట్లు పంపిణీ చేశారు. ఆర్యవైశ్య సంఘం సోదరులు, వ్యాపారవేత్తలు, స్థానికులు తదితరులు కార్యక్రమంలో పాల్గొని మహాత్మా గాంధీకి నివాళులర్పించారు.