గుడ్ల సరఫరా కొనుగోలుపై కలెక్టర్ కార్యాలయంలో టెండర్ పాల్గొన్న జెసి
సూర్య కామారెడ్డి జిల్లా ప్రతినిధి:గుడ్ల సరఫరా, కొనుగోలు టెండర్‌పై ప్రీ-బిడ్ సమావేశం గురువారం నిర్వహించారు.
కామారెడ్డి జిల్లా సమీకృత జిల్లా కార్యాలయ సముదాయం (ఐడీఓసీ)లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో గుడ్ల సరఫరా, కొనుగోలుకు సంబంధించి టెండర్‌లో పాల్గొనే ఆసక్తి ఉన్న బిడ్డర్లతో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఎన్.వై. గిరి ప్రీ-బిడ్ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా గుడ్ల సరఫరా, కొనుగోలుకు సంబంధించిన టెండర్ నిబంధనలు, అర్హతలు, షరతులు, విధివిధానాలు తదితర అంశాలను బిడ్డర్లకు అధికారులు వివరించారు. టెండర్ ప్రక్రియకు సంబంధించి బిడ్డర్లు అడిగిన సందేహాలను అధికారులు నివృత్తి చేసి, నిబంధనల ప్రకారం టెండర్ ప్రక్రియలో పాల్గొనాలని సూచించారు.
సమావేశంలో డిప్యూటీ కలెక్టర్‌తో పాటు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి, జిల్లా సంక్షేమ అధికారులు, తదితర సంక్షేమ శాఖల అధికారులు, సంబంధిత అధికారులు మరియు టెండర్‌లో పాల్గొనే ఆసక్తి ఉన్న బిడ్డర్లు పాల్గొన్నారు.