BREAKING
వైఎస్సార్‌సీపీ మండల విస్తృతస్థాయి సమావేశం. ముఖ్యఅతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి బొత్స అనంతలో అక్టోబర్ 4న ఆర్‌డీటీ బాలుర క్రికెట్ సెలక్షన్స్ సమస్యలను పరిష్కరించాలని ఎంపీకి విజ్ఞప్తి పీఎం–సూర్యఘర్ పై ప్రత్యేక అవగాహన - 17 నుంచి అక్టోబరు 17 వరకు ‘సేవా సేతు' క్యాంప్ -రూఫ్‌టాప్‌ సోలార్‌ ఏర్పాటుతో విద్యుత్‌ బిల్లుల భారం తగ్గింపు -ఏపీఎస్పీడీసీఎల్ సిఎండి శివశంకర్ లోతేటి వెల్లడి రోడ్డు భద్రతపై వాహనదారులకు ఎల్ కోట పోలీసుల అవగాహన గాంధీ జయంతిని పురస్కరించుకొని .. మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన.. ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. గాంధీ, లాల్‌బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు, రాజమహేంద్రవరం వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఘన నివాళులు ఆమె ఒక రాణి, గొప్ప యువరాజును పెంచారు.. అత్త లక్ష్మి శివకుమార్ గురించి జ్యోతిక భావోద్వేగ వ్యాఖ్యలు! ఉద్యమాలతోనే సమస్యల పరిష్కారం : ఎస్ఎఫ్ఐ బీసీల రిజర్వేషన్ల కోసం కట్టుబడి ఉన్నాం - టీడీపీ జిల్లా అధ్యక్షులు కిమిడి నాగార్జున గాంధీజీ జయంతి వేడుకలలో వి బాలాజీ రెడ్డి టాలీవుడ్‌లో సింగర్ మంగ్లీకి ప్రత్యామ్నాయంగా మారుతున్న జానపద గాయని ప్రభ.. వరుస హిట్లతో జోరు! వార్షికోత్సవ ఏర్పాట్లపై సర్వసభ్య సమావేశం గాంధీజీ చూపిన బాటలో నడవాలి... బూరుగుపల్లి శేషారావు స్వచ్ఛ ఆంధ్ర అవార్డు అందుకున్న ప్రగతి సంస్థ డైరెక్టర్ కెవి రమణ

కదిరి క్రీడాకారులు క్రికెట్ సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలి. గ్రామీణ ప్రాంత ప్రతిభను వెలికితీయడమే ఆర్‌డీటీ లక్ష్యం- మచ్చా రామలింగారెడ్డి

Select Suryaa Now
కదిరి క్రీడాకారులు క్రికెట్ సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలి. గ్రామీణ ప్రాంత ప్రతిభను వెలికితీయడమే ఆర్‌డీటీ లక్ష్యం-  మచ్చా రామలింగారెడ్డి

అనంతపురం న్యూ టౌన్ రిపోర్టర్ (తిరుపతి సురేష్)

ఉమ్మడి అనంతపురం జిల్లాలో కదిరి ప్రాంతం ప్రతిభావంతులైన క్రీడాకారులకు ప్రసిద్ధి చెందిందని ఆర్‌డీటీ ప్రాంతీయ సంచాలకులు రఘురామ్, ఆర్‌డీటీ క్రికెట్ అభివృద్ధి కమిటీ చైర్మన్ మచ్చా రామలింగారెడ్డి అన్నారు.

కదిరి ఆర్‌డీటీ డిగ్రీ కళాశాల మైదానంలో ఆర్‌డీటీ ఆధ్వర్యంలో క్రికెట్ ప్రతిభాన్వేషణ ఎంపికలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రఘురామ్, మచ్చా రామలింగారెడ్డితో పాటు ఎంపికదారులు సాయి కార్తీక్ రావు, విజయ్, ప్రశాంత్ రెడ్డి, షకీర్, ఆర్‌డీటీ గ్రామీణ స్థాయి సమన్వయకర్త కె. ప్రవీణ్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా రఘురామ్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న క్రికెట్ ప్రతిభను వెలికితీసేందుకు ఆర్‌డీటీ ప్రత్యేకంగా ప్రతిభాన్వేషణ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. ప్రతిభ కలిగిన క్రీడాకారులను గుర్తించి, వారి నైపుణ్యాలను మరింత మెరుగుపరిచేందుకు శిక్షణ శిబిరాలకు పంపుతున్నట్లు తెలిపారు.

మచ్చా రామలింగారెడ్డి మాట్లాడుతూ కదిరి ప్రాంతం నుంచి ఇప్పటికే పలువురు రంజీ ట్రోఫీ క్రీడాకారులు వెలుగులోకి వచ్చారని అన్నారు. ప్రస్తుత ప్రతిభాన్వేషణ ఎంపికల ద్వారా ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి వారికి మెరుగైన శిక్షణ, సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

గ్రామీణ ప్రాంత క్రీడాకారులు అందుబాటులో ఉన్న క్రికెట్ సౌకర్యాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మాజీ భారత, ఆంధ్ర క్రికెట్ క్రీడాకారుల సహకారంతో జాతీయ క్రికెట్ అకాడమీ, రాష్ట్ర జట్ల శిక్షణ శిబిరాల తరహాలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు.

గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభను ప్రోత్సహించి, వారికి మెరుగైన శిక్షణ అందించడమే ఆర్‌డీటీ ప్రధాన లక్ష్యమని తెలిపారు.

ఈ ప్రతిభాన్వేషణ ఎంపికల్లో మొత్తం 90 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. కార్యక్రమంలో కదిరి క్రికెట్ సంఘం కోశాధికారి ముబారక్, సీనియర్ క్రీడాకారులు నాగరాజ్, అనిల్, దివాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.