వైఎస్సార్సీపీ మండల విస్తృతస్థాయి సమావేశం. ముఖ్యఅతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి బొత్స
కొత్తవలస అక్టోబర్ 2 మేజర్ న్యూస్
మండలంలోని మంగళపాలెం సమీపంలోని ఏ జె ఆర్ కన్వెన్షన్ లో శుక్రవారం వైఎస్సార్‌సీపీ మండల విస్తృతస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు . మండల పార్టీ అధ్యక్షులు, అధ్యక్షతన స్థానిక మాజీ శాసనసభ్యులు కడుబండి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి శాసనమండలి ప్రతిపక్ష నాయకులు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా మాజీ ఎమ్మెల్యే కడుబoడి మాట్లాడుతూ పార్టీని నమ్ముకుని పార్టీ కోసం పనిచేసే నాయకులకు గాని కార్యకర్తలు గాని పార్టీ అధిష్టానం గుర్తిస్తుందని వారికి రాబోయే రోజుల్లో వారికి పదవులు ఇచ్చి వారి గౌరవాన్ని పెంచుతుందని అన్నారు. అనంతరం
మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని, ప్రజలతో మమేకమై పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు.కూటమి ప్రభుత్వం ఎన్నికల్లోఇచ్చిన హామీలు ఏది ప్రజలకు చేరలేదని ఈ విషయాన్ని ప్రతి గ్రామానికి వెళ్లి కూటమి ప్రభుత్వం చేసిన మోసాలను ప్రజలకు వివరించాలని ఆయన అన్నారు ముఖ్యంగా వైఎస్సార్సీపీ నాయకులకు కార్యకర్తలకు ఐదు లక్షల బీమా గ్యారంటీతో ఒక ఐడి కార్డు తయారు చేసిందని ఈ కార్డును ప్రతి ఇంటింటికి వెళ్లి వారికి అందజేయాలన్నారు
స్థానిక సంస్థల ఎన్నికలకు నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని ఆయన సూచించారు. పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నింపేలా నాయకులు సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో
జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బెల్లాన చంద్రశేర్ , మాజీ ఎంపీ, విశాఖ పార్లమెంట్ ఇంఛార్జి బొత్స ఝాన్సీలక్ష్మి , పాడేరు మాజీ ఎమ్మెల్యే కే. భాగ్యలక్ష్మిఅనకాపల్లి మాజీ ఎమ్మెల్యే శోభా హైమవతి మాజీ DCCB చైర్మన్ వేచలపు చిన రామునాయుడు మండల పార్టీ అధ్యక్షులు మాజీ ఎంపీపీ లు, మాజీ జెడ్పీటీసీ లు, మండల పార్టీ అధ్యక్షులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీ లు, లక్కవరపుకోట, వేపాడ మండలాల ముఖ్య నాయకులు, నియోజకవర్గ అనుబంధ విభాగాల అధ్యక్షులు, మండల వైఎస్సార్సీపీ నాయకులు, బారీ ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు...