అంగన్వాడీ కేంద్రాల్లో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు
పొదలకూరు, మేజర్ న్యూస్ : పొదలకూరు మండలంలోని ఐసీడీఎస్ పరిధిలో ఉన్న అంగన్వాడీ కేంద్రాల్లో గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీజీ ఆశయాలను చిన్నారులకు వివరించారు. అహింస, సత్యం, శాంతి మార్గంలో నడవాలని సూచించారు.వేడుకల్లో భాగంగా అంగన్వాడీ కేంద్రాలను అందంగా అలంకరించి, మహాత్మా గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. గాంధీజీ దేశానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. చిన్నారులు, తల్లులు, తల్లిదండ్రులు, స్థానికులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.అనంతరం అంగన్వాడీ కేంద్రాలకు వచ్చిన చిన్నారులకు పండ్లు, మిఠాయిలను పంపిణీ చేశారు. చిన్నారులకు గాంధీజీ జీవిత విశేషాలను వివరిస్తూ దేశభక్తి, పరిశుభ్రత, క్రమశిక్షణ వంటి అంశాలపై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ లక్ష్మీతో పాటు అంగన్వాడీ పిల్లలు, తల్లిదండ్రులు, స్థానికులు, తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.