తలసాని జన్మదిన వేడుకలు.. మహంకాళి అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు
సికింద్రాబాద్ మేజర్ న్యూస్ : మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ జన్మదినం సందర్బంగా ఉజ్జయిని మహంకాళి దేవాలయం లో అత్యంత భక్తి శ్రద్దలతో పూజలు చేశారు. మంగళవారం ఉజ్జయిని మహంకాళి దేవాలయం మాజీ ట్రస్ట్ బోర్డు సభ్యులు కొండాపురం మహేష్ యాదవ్ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. తలసాని పేరు మీద అర్చనలు చేసి ఇంకా ఉన్నత స్థాయికి చేరుకోవాలని పూజలు చేశారు... ఈ కార్యక్రమం లో అరుణ్ భట్, ఆనంద్ పాటిల్, చందు వర్మ, గడ్డం శ్రీకాంత్, శ్రీధర్, మురళి తదితరులు పాల్గొన్నారు..