పంట పండించే రైతు లేకపోతే ప్రపంచానికే మనుగడలేదు. గొట్టిపాటి లక్ష్మి
రైతుల అభ్యున్నతికి చంద్రబాబు పెద్ద పీట.
అసంపూర్తిగా నిలిచిన రైతు బజార్ కు గొట్టిపాటి లక్ష్మీ కృషితో మోక్షం .
శర వేగంగా జరుగుతున్న రైతు బజార్ పనులు.
సూర్య న్యూస్ దర్శి.
పంట పండించే రైతు లేకపోతే ప్రపంచానికి మనుగడ లేదనీ, రైతులు అందించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పిస్తూ రైతుల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం పెద్ద పీఠ వేస్తుంది. సీఎం నారా చంద్రబాబు నాయుడు రైతుల అభ్యున్నతికి అహర్నిశలు కృషి చేస్తూ ఆర్థికంగా ఎదిగేందుకు పలు అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. దర్శిలో గత వైసిపి ప్రభుత్వం నిర్లక్ష్యం గా వదిలేసిన రైతు బజార్ కు నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ కృషితో మోక్షం లభించింది. నియోజకవర్గంలోని రైతుల సమస్యలు ఎప్పటికప్పుడు తెలుసుకొని వాటిని పరిష్కరించడంలో డాక్టర్ లక్ష్మి సఫలీకృతులయ్యారు. రైతు బజార్ నిర్మాణానికి నిధులు కేటాయించి , నిర్మాణపు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అతి కొద్ది రోజుల్లోనే రైతు బజార్ అందుబాటులోకి రానుంది.