పార్టీ ఐడీ కార్డు అందుకున్న బీసీ సెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్
అనంతపురం బ్యూరో : వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి చేతుల మీదుగా బీసీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్ పార్టీ ఐడీ కార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు రమేష్ గౌడ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ బీసీ వర్గాల సమస్యలను పార్టీ దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని రమేష్ గౌడ్ తెలిపారు. తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని రమేష్ గౌడ్‌కు అభినందనలు తెలియజేశారు.
రిపోర్టర్ : మొయినుద్దీన్, అనంతపురం బ్యూరో, అనంతపురం.