మైసమ్మ ఆలయ నిర్మాణానికి మల్లేశం రూ.21 వేల విరాళం
చౌటుప్పల్, మేజర్ న్యూస్:మున్సిపాలిటీ పరిధిలోని తాళ్లసింగారం గ్రామంలో నిర్మిస్తున్న శ్రీశ్రీశ్రీ బంగారు మైసమ్మ, పాపమ్మ దేవాలయ నిర్మాణానికి లింగోజిగూడెం వాస్తవ్యులు, మాజీ మూడో వార్డు కౌన్సిలర్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బండమీది మల్లేశం రూ.21 వేల విరాళం అందజేశారు. అమ్మవార్ల పేరుతో ఆలయ నిర్మాణానికి ఈ మొత్తాన్ని చందాగా అందించారు.ఈ సందర్భంగా ఆలయ కమిటీ, కుల సంఘం ప్రతినిధులు మల్లేశం దంపతులకు, వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ కుల పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.