మున్సిపల్ కార్మికుల వేతనాల చెల్లింపులో ప్రతి నెల లక్షల రూపాయల స్కాం
సూర్య కామారెడ్డి,కామారెడ్డి పట్టణంలోని మున్సిపల్ పరిధిలో పని చేసే పారిశుధ్య కార్మికులకు చెల్లించే వేతనాలు అవకతవకలపై బీజేపీ మున్సిపల్ కౌన్సిలర్ లు బీజేపీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మోటూరీ శ్రీకాంత్ మాట్లాడుతూ పట్టణములో నూతన పాలక వర్గం ఏర్పాటు అయిన నాటి నుండి అభివృద్ధి మాట తరువాత కనీసం వార్డుల్లో పారిశుధ్య సమస్య తీర్చాలని గత 8నెలలుగా అన్ని పార్టీల కౌన్సిలర్ లు సర్వ సభ్య సమావేశాలలో విన్నవించుకున్న ఎలాంటి పురోగతి లేదని గత వారం ఉదయం హాజరు సమయంలో బీజేపీ కౌన్సిలర్ల బృందం ఉదయం వెళ్లగా అక్కడ పని చేసే సిబ్బందికి, హాజరు పట్టికలో వేసిన హాజరుకి సంబంధం లేదని , జీతాల చెల్లింపులో కూడా అవకతవకలు జరుగుతున్నాయని అధికారుల దృష్టికి తీసుకెళ్లగా పారిశుధ్య కార్మికుల వేతనాలు చెల్లించే 35 గ్రూపులకు చెల్లించిన వేతనాల విషయంలో అనుమానంతో నేడు ఉదయం కార్మికులను వివరాలు అడిగి తెలుసుకోవడం జరిగిందని. మున్సిపల్ నుండి గ్రూపులకు చెల్లించిన వేతనానికి కార్మికులకు చెల్లించిన వేతనానికి చాలా తేడా ఉన్నదని అన్నారు. వేతనాలు చెల్లించే గ్రూపులో లేని వారికి చెక్ పవర్ ఉండటం, చెక్ పవర్ ఉన్న వారు చేతి వాటం చూపడం, వేతనాలు చెల్లించేటప్పుడు కోతలు విధించడం అనేక అనుమానాలకు తావిస్తుందని అన్నారు. పూర్తి స్థాయి శానిటేషన్ ఇన్స్పెక్టర్ లేకపోవడం వల్ల ఇంచార్జీల కారణంగా డబ్బులు అవకతవకలు జరుగుతున్నాయని, వాటర్ వర్క్స్ విభాగం, ఎలక్ట్రిసిటీ ఉద్యోగులు, కార్యాలయ సిబ్బంది విత్తనాల విషయంలో కూడా అనేక అనుమానాలు ఉన్నాయని అన్నింటి విషయంలో విచారణ చేపట్టాలని కలెక్టర్, గౌరవ MLA గారికి విజ్ఞప్తి చేస్తామని అన్నారు
నిజాలు నిగ్గు తేలాల్సిన అవసరం ఉందని ప్రతి నెల లక్షల రూపాయలు దారి మళ్లుతున్నాయని, ప్రజా ధనం దుర్వినియోగం అయితే బీజేపీ చూస్తూ ఊరుకోదని అన్నారు.