మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ పిలుపు కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ .
పత్తికొండ, సూర్య మేజర్ న్యూస్: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు శక్తివంచన లేకుండా పనిచేయాలని పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ పిలుపునిచ్చారు.బుధవారం ఉదయం పత్తికొండలోని వైఎస్సార్సీపీ క్యాంపు కార్యాలయంలో మాజీ ఎంపీపీ నాగరత్నమ్మతో కలిసి ఆమె పార్టీ క్రియాశీలక కార్యకర్తలకు గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రీదేవమ్మ మాట్లాడుతూ... పార్టీ సభ్యత్వం కలిగిన కార్యకర్త ప్రమాదవశాత్తు మరణిస్తే వారి కుటుంబానికి రూ.5 లక్షల బీమా పరిహారం అందేలా పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి నిర్ణయించారని తెలిపారు. కార్యకర్తల సంక్షేమానికి పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్, మాజీ ఎంపీపీ, పట్టణ మాజీ వార్డు సభ్యులు, స్థానిక నాయకులు మరియు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు