BREAKING
వృద్ధురాలిని ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. మూడు దశాబ్దాల నిరీక్షణకు తెర - పొన్నూరు కోర్టు పరిధి రెట్టింపు 2047 నాటికి వికసిత్ భారత్ నిర్మాణానికి సుపోషిత భారతే పునాది-ఐసిడిఎస్ సూపర్వైజర్ జి కరుణ కుమారి లయన్స్ క్లబ్ స్వాగత బోర్డులు ఏర్పాటు ఇసుక లారీల దుమ్ముతో వ్యాపారుల ఇక్కట్లు విద్యార్థుల క్రీడాభివృద్దే నా లక్ష్యం విద్యార్థిని విద్యార్థులకు స్పోర్ట్స్ సామాగ్రి అందజేసిన కొవ్వాసు జగదీశ్వరి టీడీపీ పార్టీ కి రాజీనామా చేసిన మాజీ జడ్పీటీసీ చిన్నప్పయ* .? *పెనుకొండ నియోజకవర్గం లో టీడీపీ పార్టీ నీ వీడనున్న మరికొంత మంది నాయకులు?* గ్రామీణుల ఆరోగ్యమే ప్రాధాన్యత.. ప్రతి పేదవాడికి వైద్యం అందుబాటులోకి తేవడమే ప్రజా ప్రభుత్వం లక్ష్యం: పేద కుటుంబాల ఎంపికపై మండల స్థాయి అవగాహన కార్యక్రమం మల్లాపూర్‌లో గిరిజన మినీ గురుకులం,మోడల్ స్కూల్‌ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ గట్టు పై ఘాట్ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన మున్సిపల్ కార్మికుల వేతనాల చెల్లింపులో ప్రతి నెల లక్షల రూపాయల స్కాం స్థలాల కోసం బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు బంజేయ్.. సాధారణ ఆడియో లాంచ్‌కు దూరంగా జైలర్ 2 టీమ్.. ఓటీటీలో గ్రాండ్‌గా సూపర్ షో ప్రసారం! పార్టీ ఐడీ కార్డు అందుకున్న బీసీ సెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్

లయన్స్ క్లబ్ స్వాగత బోర్డులు ఏర్పాటు

Select Suryaa Now
లయన్స్ క్లబ్ స్వాగత బోర్డులు ఏర్పాటు

ఉండి, మేజర్ న్యూస్: అంతర్జాతీయ స్వచ్ఛంద సేవా సంస్థ  లయన్స్ క్లబ్ ఉండి ఆధ్వర్యంలో గ్రామ సరిహద్దుల్లో స్వాగత బోర్డులను ఏర్పాటు చేయడం జరిగిందని క్లబ్ అధ్యక్షుడు ద్వారంపూడి నారాయణరెడ్డి తెలిపారు. స్వాగత బోర్డులు ప్రారంభోత్సవానికి ఉండి ఎస్సై హనుమంత మల్లికార్జునరావు హాజరై వాటిని ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్సై మల్లికార్జునరావు మాట్లాడుతూ ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని సమాజంలో ఎవరికి ఏ అవసరం వచ్చినా లయన్స్ క్లబ్ ప్రతినిధులు స్పందిస్తున్న తీరు అమోఘం అన్నారు వారి సేవలు ఇలాగే కొనసాగించాలని ఆకాంక్షించారు చేస్తున్న సేవలకు క్లబ్ ప్రతినిధులకు అభినందనలు తెలిపారు. అనంతరం క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ గ్రామంలోనికి ప్రవేశించే ప్రయాణికులను ఆహ్వానించేలా గ్రామ సౌందర్యాన్ని ఇమిడింప చేసేలా లయన్స్ క్లబ్ తరఫున స్వాగత బోర్డులు ఏర్పాటు చేయడం జరిగిందని ఒక బోర్డును లయన్స్ జిల్లా గవర్నర్ దశిక సుబ్బారావు అందించగా మిగిలిన రెండు బోర్డులను క్లబ్ అధ్యక్షుడు ద్వారంపూడి నారాయణరెడ్డి ఆర్థిక సహాయంతో ఏర్పాటు చేయడం జరిగిందని క్లబ్ కార్యదర్శి రుద్రరాజు నరసరాజు తెలిపారు. జిల్లా ప్రధమ ఉప గవర్నర్ ఆర్ వి ఎస్ సూర్యనారాయణ రాజు చేతుల మీదుగా ఉండి ఎస్సై మల్లికార్జునరావుకు సాలువ కప్పి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ రీజియన్స్ సెక్రటరీ సత్తి బ్రహ్మ రెడ్డి, కోఆర్డినేటర్ గాదిరాజు రంగరాజు, కోశాధికారి కన్నెగంటి రూత్ కళ, భూపతి రాజు హరినాథ్ రాజు, కాగిత మహంకాళి, బుద్ధరాజు సుబ్బరాజు, బొండాడ కేశవరావు, తదితర క్లబ్ ప్రతినిధులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

 రిపోర్టర్ రాజు ఉండి పశ్చిమగోదావరి జిల్లా