2047 నాటికి వికసిత్ భారత్ నిర్మాణానికి సుపోషిత భారతే పునాది-ఐసిడిఎస్ సూపర్వైజర్ జి కరుణ కుమారి
ముదినేపల్లి , మేజర్ న్యూస్ : మండలంలోని వడాలి గ్రామ సచివాలయంలో వడాలి , తూర్పుపాకల , కామనపూడి గ్రామాల అంగన్వాడి సిబ్బంది 9వ జాతీయ పోషణ మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐసిడిఎస్ సూపర్వైజర్ జి కరుణ కుమారి మాట్లాడుతూ 2047 నాటికి వికసిత్ భారత్ నిర్మాణానికి సుపోషిత భారతే పునాదన్నారు. గర్భిణీలకు పౌష్టికాహార ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. పిల్లల పోషణ , ఆరోగ్యం సంరక్షణతో పాటు ప్రాథమిక విద్యకు అంగన్వాడి కేంద్రాలు కీలకంగా నిలుస్తాయన్నారు. అనంతరం గర్భిణీలకు శ్రీమంతాలు నిర్వహించారు. అంగన్వాడి సిబ్బందిని తెలుగుదేశంపార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వీరమల్లు నరసింహారావు శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పంచాయితీ కార్యదర్శి రావి రమాదేవి , వీఆర్వో ఎం పద్మావతి , కట్టా కోటయ్య , నక్కా అప్పారావు , అనగాని గంగాధరరావు , బొర్రా సత్యనారాయణ , వీరమల్లు శేషు , హెచ్ఎస్ కె శ్రీనివాసరావు , అంగన్వాడి కార్యకర్తలు కె విజయలక్ష్మి , ఈ జగదీశ్వరి , పి నాగజ్యోతి , డివిఎల్ఏ సుప్రభాత , ఎస్ పద్మ , ఎస్.కె అశ్రీమున్నీసా , ఏఎన్ఎం జి చంద్రిక , ఆశావర్కర్లు పాల్గొన్నారు.
నాగరాజు ముదినేపల్లి ఏలూరు జిల్లా