BREAKING
39 మద్యం దుకాణాలకు లాటరీ నేడు అనంతపురం కలెక్టర్ సమక్షంలో డ్రా ఆఫ్ లాట్స్ ఉదయం 7.30 గంటల్లోపు అర్హత కలిగిన దరఖాస్తుదారులు హాజరు కావాలి అందరి చిన్ననాటి జ్ఞాపకాలను తట్టిలేపేలా 'సమ్మర్ హాలిడేస్' నుంచి ఫ్రెండ్‌షిప్ సాంగ్ విడుదల! రెవెన్యూ దరఖాస్తుల పరిష్కారంలో జాప్యానికి తావులేకుండా చర్యలు-జిల్లా కలెక్టర్‌ రాజకుమారి గణియా ఎంపీ తండ్రి మునికృష్ణయ్యకు పరామర్శ కావలిలో జనసేనలో చేరిన వైసీపీ వాలంటీర్లు, నాయకులు ఎన్నికలలో భాగంగా సిరిసిల్ల బస్ డిపోలో ప్రచారంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే చోడ వెంకట రెడ్డి ప్రమాద బాధిత కుటుంబానికి మున్నా నగర్ రమేష్ ఆర్థిక సాయం సమాచార హక్కు చట్టంపై అవగాహన నంద్యాలలో నీటి సరఫరాలో అంతరాయం - మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న డిఫరెంట్ థ్రిల్లర్‌గా వస్తున్న మయూఖ.. హాలీవుడ్ స్థాయి అనుభూతిని ఇస్తుంది: దర్శకుడు శ్రీ తేజ్ ఎస్.కె! మొండిదిన్నెపాలెంలో శ్రీశ్రీశ్రీ పోలేరమ్మ తల్లి జాతర మహోత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మానవత్వమే మనిషి నిజమైన చిరునామా రాష్ట్రస్థాయి పోటీలకు సాయి సత్య చిన్మయి ఎంపిక. సింగరేణి లాభాల్లో కార్మికులకు 36% వాటా ఇవ్వాలి - లేకుంటే సింగరేణి భవన్‌, ప్రజాభవన్‌ ముట్టడి: టీజీబీకేఎస్‌ రిలయన్స్ గో బ్యాక్గ్గు గ్యాస్ ఉత్పత్తితో పర్యావరణానికి పంటలకు తీవ్ర నష్టం..* *ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె.శ్రీనివాస్..*

రైతులు ఆశలతో మినుము పంట సాగు

Select Suryaa Now
రైతులు  ఆశలతో మినుము పంట సాగు

దువ్వూరు మేజర్ న్యూస్ :ఈ సంవత్సరంలో సరైన వర్షాలు లేక ఖరీఫ్ సీజన్ లో రైతులు సాగు చేసిన పంటలు సరిగా పండలేదు. సాగు చేసిన పంటలు కొన్ని ఎండిపోగా మరికొన్ని పంటలు అరకొర దిగుబడి వచ్చాయి. ఈ క్రమంలో ఇటీవల కురిసిన వానలతో రైతులు రబీ సాగుకు సిద్దమవుతున్నారు. దువ్వూరు మండలంలో 23 గ్రామపంచాయతీలలోని గ్రామాల్లోని రైతులు రబీ సీజన్లో  ముమ్మరంగా మినుము పంటను సాగు చేస్తున్నారు. కేసీ కాలువకు నీరు రాకపోవడంతో వరి పంట వేయాల్సిన మడులు, పొలాల్లో విస్తారంగా ఈ ఏడాది మినుము,జొన్న, తెల్లనూగు, మొబ్బు రకం నూగు పంటలు సాగచేస్తున్నారు . అలాగే మినుము పంటకు ఇదే అదును కావ డంతో ట్రాక్టర్లతో ఎరువులు, విత్తనాలు రెండింటిని పెట్టె గొర్రు ద్వారా విత్తుతున్నారు. పెట్టుబడులు కూడా తక్కువగా అవుతాయని, దిగుబడులు

అనుకున్నమేర రావాలని ఆశలతోరైతులు పంటను

సాగు చేస్తున్నామని రైతన్నలు చెబుతున్నారు. ఖరీఫ్ సీజన్లో సాగుచేసిన పెద్ద బళ్ళారి ఉల్లిగడ్డలు రేటు ఒక్కసారి తగ్గడంతో రైతన్నలు దిగులు చెందుతున్నారు. మార్కెట్లో ఉల్లిగడ్డలు రేటు 70 రూపాయల నుంచి 90 రూపాయల అమ్ముతున్నారు. అయినా మండలంలోని రైతలు పండించిన ఉల్లి గడ్డలు వచ్చేసరికి 2000 రూపాయల నుంచి 3000 వరకు కొంటున్నారు అని రైతులు అందజేస్తున్నారు. అవి కూడా 120 కేజీల వంతున ఒక బస్తా అని వ్యాపారస్తులు కొంటున్నారు.రైతులు ఆందోళన చేస్తున్నారు.

 ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులు పండించిన పెద్ద బళ్ళారి ఉల్లిగడ్డలను 4వేల నుంచి 5వేల రూపాయలు వరకు కొనుగోలు చేసి రైతు బజార్లో సబ్సిడీకి ఇవ్వవచ్చు కదా అని కొందరు రైతులు అంటున్నారు. మండలంలో రామాపురం , మీర్జాఖాన్ పల్లె , కటిక పల్లె , గుడిపాడు, గొల్లపల్లి , చల్లబసాయపల్లె, చిన్న సింగన పల్లె , మదిరేపల్లె, తదితర గ్రామాలలో పెద్ద బళ్ళారి ఉల్లిగడ్డల పంట నూర్పిల్లు మొదలయ్యాయని రైతన్నలు తెలిపారు. మార్ఫింగ్ మరియు నాఫెడ్ అధికారులు స్పందించి రైతుల నుంచి ఉల్లిగడ్డల కొనుగోలు చేయాలని రైతన్నను తెలుపుతున్నారు. ఏదేమైనా ఈ సంవత్సరం పంటలు పండించాలంటే  చాలా కష్టమని రైతన్నలు అంటున్నారు. దువ్వూరు మండలంలో కరువు మండలం రైతులు ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం వస్తుందని ఎదురుచూస్తున్నారు. 24- 25 సంవత్సరములో కరువు మండలం గా ప్రకటించారని, అప్పుడు రైతుకు ఒక రూపాయి కూడా ప్రభుత్వం నుంచి సహాయం అందలేదని రైతులను తెలియజేస్తున్నాను. ఏమైనా రైతన్నలు ఆరుగాలం పండించిన పంటలు చేతి కొచ్చేసరికి ధరలు పడిపోవుతున్నాయని రైతన్నలు లోనన కుమిలిపోతున్నారు.

 

బోొర్రా శివరామిరెడ్డి

నేటి దినపత్రిక సూర్య ఖాజీపేట