గ్రామ రెవెన్యూ సహాయకులను విస్మరిస్తే ప్రభుత్వానికి పుట్టగతులు ఉండవు
- దువ్వూరు లో 22వ రోజు కొనసాగుతున్న వీఆర్ఏల సహాయ నిరాకరణ ఉద్యమం
- జమ్మలమడుగు డివిజన్ వీఆర్ఏల సంఘం ఉపాధ్యక్షులు దస్తగిరి
- దువ్వూరు మండల వీఆర్ఏల సంఘం అధ్యక్షులు సంపత్
దువ్వూరు, మేజర్ న్యూస్ :
రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ రెవెన్యూ సహాయకుల ను విస్మరిస్తే కూటమి ప్రభుత్వానికి పుట్టగతులు ఉండవని ఊరు మండల వీఆర్ఏల సంఘం అధ్యక్షులు సంపత్, జమ్మలమడుగు డివిజన్ వీఆర్ఏల సంఘం ఉపాధ్యక్షులు దస్తగిరి లు అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన సహాయ నిరాకరణ ఉద్యమం దువ్వూరు మండలం నందు కొనసాగుతుంది. తహసీల్దార్ కార్యాలయం ఎదుట 22 వ రోజు బుధవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సంపత్ , దస్తగిరి లు మాట్లాడుతూ గ్రామంలో ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ, రెవిన్యూ పంచాయతీ రాజ్, పోలీస్ శాఖ,అగ్రికల్చర్ మొదలగు వివిధ రకాల డిపార్ట్మెంట్ల అధికారులు గ్రామంలోకి వస్తే వారికి దగ్గర ఉండి ప్రభుత్వ కార్యకలాపాలను ప్రజలకు అందించడంలో మా విఆర్ఏల పాత్ర మరుపు రానిది అని అన్నారు.ఉద్యమం చేపట్టి దాదాపుగా 22 రోజులు గడిచిన మా సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం కాలయాపన చేస్తుందన్నారు. మా యొక్క న్యాయబద్ధమైన డిమాండ్లను తెలంగాణ తరహాలో జి ఓ ఎన్ని నెంబర్ . 81 ప్రకారం
1.పేస్కెల్ అమలు చేయాలని...
2.నామిని వీఆర్ఏలను రెగ్యులర్ చేయాలని... 3.అర్హులైన వారికి గ్ ప్రమోషన్ ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఏలు చెన్నమ్మ, సుబ్బమ్మ, వెంకటయ్య, పెద్ద సుబ్బరాయుడు, కొండయ్య, సుబ్బరాయుడు, రాజన్న, ప్రసాద్, తదితర వీఆర్ఏలు పాల్గొన్నారు