BREAKING
పిట్టలవాడలో కమ్యూనిటీ కాంటాక్ట్ - ఎస్పీ అఖిల్ మహాజన్ లిప్స్ 39 మద్యం దుకాణాలకు లాటరీ నేడు అనంతపురం కలెక్టర్ సమక్షంలో డ్రా ఆఫ్ లాట్స్ ఉదయం 7.30 గంటల్లోపు అర్హత కలిగిన దరఖాస్తుదారులు హాజరు కావాలి అందరి చిన్ననాటి జ్ఞాపకాలను తట్టిలేపేలా 'సమ్మర్ హాలిడేస్' నుంచి ఫ్రెండ్‌షిప్ సాంగ్ విడుదల! రెవెన్యూ దరఖాస్తుల పరిష్కారంలో జాప్యానికి తావులేకుండా చర్యలు-జిల్లా కలెక్టర్‌ రాజకుమారి గణియా ఎంపీ తండ్రి మునికృష్ణయ్యకు పరామర్శ కావలిలో జనసేనలో చేరిన వైసీపీ వాలంటీర్లు, నాయకులు ఎన్నికలలో భాగంగా సిరిసిల్ల బస్ డిపోలో ప్రచారంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే చోడ వెంకట రెడ్డి ప్రమాద బాధిత కుటుంబానికి మున్నా నగర్ రమేష్ ఆర్థిక సాయం సమాచార హక్కు చట్టంపై అవగాహన నంద్యాలలో నీటి సరఫరాలో అంతరాయం - మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న డిఫరెంట్ థ్రిల్లర్‌గా వస్తున్న మయూఖ.. హాలీవుడ్ స్థాయి అనుభూతిని ఇస్తుంది: దర్శకుడు శ్రీ తేజ్ ఎస్.కె! మొండిదిన్నెపాలెంలో శ్రీశ్రీశ్రీ పోలేరమ్మ తల్లి జాతర మహోత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మానవత్వమే మనిషి నిజమైన చిరునామా రాష్ట్రస్థాయి పోటీలకు సాయి సత్య చిన్మయి ఎంపిక. సింగరేణి లాభాల్లో కార్మికులకు 36% వాటా ఇవ్వాలి - లేకుంటే సింగరేణి భవన్‌, ప్రజాభవన్‌ ముట్టడి: టీజీబీకేఎస్‌

సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి సోషల్ మీడియాలో వ్యక్తిగత వివరాలు పంచుకోవద్దు: పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా

Select Suryaa Now
సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి సోషల్ మీడియాలో వ్యక్తిగత వివరాలు పంచుకోవద్దు: పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా

 

సూర్య మంచిర్యాల : సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సూచించారు. ముఖ్యంగా యువత సామాజిక మాధ్యమాలను జాగ్రత్తగా వినియోగించాలని, వ్యక్తిగత వివరాలను సోషల్ మీడియాలో బహిర్గతం చేయవద్దని హెచ్చరించారు. సైబర్ మోసాలకు గురైన వెంటనే 1930 నంబర్‌కు సమాచారం అందించాలని సూచించారు.జాతీయ సైబర్ భద్రత అవగాహన మాసం సందర్భంగా తెలంగాణ సైబర్ భద్రతా విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాల్లో భాగంగా బుధవారం మంచిర్యాల పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలు, సోషల్ మీడియా వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. “పౌస్ ఫర్ సేఫ్టీ -పౌస్, థింక్, వెరిఫై” అనే నినాదంతో ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు.ఈ కార్యక్రమానికి రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ తదితర సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగత సమాచారం, కుటుంబ వివరాలు, ఫొటోలు, ఆర్థిక వివరాలు వంటి సున్నితమైన సమాచారాన్ని బహిరంగంగా పంచుకోవద్దన్నారు. సైబర్ నేరగాళ్లు ఆధునిక సాంకేతికతను ఉపయోగించి వ్యక్తిగత వివరాలను సేకరించి మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు.రైతుల నమోదు, యూరియా యాప్ డౌన్‌లోడ్ తదితర పేర్లతో ఎవరైనా ఫోన్ చేసి ఓ టీ పి పిన్, పాస్‌వర్డ్, బ్యాంకు ఖాతా వివరాలు అడిగితే స్పందించవద్దని సూచించారు.అనుమానాస్పద ఫోన్ కాల్స్, సందేశాలు, లింకులు, యాప్‌ల విషయంలో తొందరపడి నిర్ణయం తీసుకోకుండా ముందుగా ఆలోచించి, వివరాలను ధృవీకరించిన తర్వాతే స్పందించాలని సూచించారు.తెలియని లింకులపై క్లిక్ చేయడం, అనుమానాస్పద యాప్‌లను డౌన్‌లోడ్ చేయడం ద్వారా ఆర్థిక నష్టం జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. సైబర్ మోసం జరిగినట్లు గుర్తించిన వెంటనే లేదా అనుమానాస్పద లావాదేవీ జరిగిన వెంటనే జాతీయ సైబర్ నేరాల హెల్ప్‌లైన్ 1930కు సమాచారం అందించాలని కోరారు.సైబర్ నేరాల నియంత్రణలో పోలీసుల చర్యలతో పాటు ప్రజల అప్రమత్తత, సహకారం కూడా కీలకమని కమిషనర్ పేర్కొన్నారు. విద్యార్థులు తాము జాగ్రత్తలు పాటించడంతో పాటు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, స్నేహితులకు కూడా సైబర్ భద్రతపై అవగాహన కల్పించాలని సూచించారు.అనంతరం “ పౌస్ ఫర్ సేఫ్టీ -పౌస్, థింక్, వెరిఫై నినాదంతో రూపొందించిన సైబర్ భద్రత అవగాహన పోస్టర్‌ను పోలీసు అధికారులతో కలిసి కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఏసీపీ ఆర్. ప్రకాష్, సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏసీపీ డి.వి. రంగారెడ్డి, మంచిర్యాల పట్టణ ఇన్‌స్పెక్టర్ ప్రమోదరావు,రామగుండం సైబర్ క్రైమ్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, సైబర్ క్రైమ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.