BREAKING
పిట్టలవాడలో కమ్యూనిటీ కాంటాక్ట్ - ఎస్పీ అఖిల్ మహాజన్ లిప్స్ 39 మద్యం దుకాణాలకు లాటరీ నేడు అనంతపురం కలెక్టర్ సమక్షంలో డ్రా ఆఫ్ లాట్స్ ఉదయం 7.30 గంటల్లోపు అర్హత కలిగిన దరఖాస్తుదారులు హాజరు కావాలి అందరి చిన్ననాటి జ్ఞాపకాలను తట్టిలేపేలా 'సమ్మర్ హాలిడేస్' నుంచి ఫ్రెండ్‌షిప్ సాంగ్ విడుదల! రెవెన్యూ దరఖాస్తుల పరిష్కారంలో జాప్యానికి తావులేకుండా చర్యలు-జిల్లా కలెక్టర్‌ రాజకుమారి గణియా ఎంపీ తండ్రి మునికృష్ణయ్యకు పరామర్శ కావలిలో జనసేనలో చేరిన వైసీపీ వాలంటీర్లు, నాయకులు ఎన్నికలలో భాగంగా సిరిసిల్ల బస్ డిపోలో ప్రచారంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే చోడ వెంకట రెడ్డి ప్రమాద బాధిత కుటుంబానికి మున్నా నగర్ రమేష్ ఆర్థిక సాయం సమాచార హక్కు చట్టంపై అవగాహన నంద్యాలలో నీటి సరఫరాలో అంతరాయం - మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న డిఫరెంట్ థ్రిల్లర్‌గా వస్తున్న మయూఖ.. హాలీవుడ్ స్థాయి అనుభూతిని ఇస్తుంది: దర్శకుడు శ్రీ తేజ్ ఎస్.కె! మొండిదిన్నెపాలెంలో శ్రీశ్రీశ్రీ పోలేరమ్మ తల్లి జాతర మహోత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మానవత్వమే మనిషి నిజమైన చిరునామా రాష్ట్రస్థాయి పోటీలకు సాయి సత్య చిన్మయి ఎంపిక. సింగరేణి లాభాల్లో కార్మికులకు 36% వాటా ఇవ్వాలి - లేకుంటే సింగరేణి భవన్‌, ప్రజాభవన్‌ ముట్టడి: టీజీబీకేఎస్‌

వైసీపీ హయాంలో అభివృద్ధి కనబడలేదా? కూటమి ప్రభుత్వానికి అభివృద్ధి కార్యక్రమాలు కనిపించడం లేదా..! కేవలం ఆర్భాటాలకే పరిమితమయ్యారంటూ విమర్శలు సింగనమల మాజీ సమన్వయకర్త వీరాంజనేయులు

Select Suryaa Now
వైసీపీ హయాంలో అభివృద్ధి కనబడలేదా?  కూటమి ప్రభుత్వానికి అభివృద్ధి కార్యక్రమాలు కనిపించడం లేదా..!  కేవలం ఆర్భాటాలకే పరిమితమయ్యారంటూ విమర్శలు  సింగనమల మాజీ సమన్వయకర్త వీరాంజనేయులు

అనంతపురం బ్యూరో : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో సింగనమల నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు కూటమి ప్రభుత్వానికి, నాయకులకు కనిపించడం లేదా అని సింగనమల మాజీ సమన్వయకర్త వీరాంజనేయులు ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు కావస్తున్నా నియోజకవర్గంలో చెప్పుకోదగిన అభివృద్ధి ఎక్కడ జరిగిందో చూపించాలని ఆయన డిమాండ్ చేశారు.

బుధవారం సింగనమలలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వీరాంజనేయులు మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఆధ్వర్యంలో నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఆయన తెలిపారు.

సింగనమల చెరువును లోకలైజేషన్ చేసి ఒక టీఎంసీ నీటి కేటాయింపు చేయడంతో పాటు ఎల్లనూరు, పుట్లూరు మండలాల పరిధిలోని చెరువులకు నీటిని అందించే చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. తద్వారా సాగు, తాగునీటి అవసరాల పరిష్కారానికి చర్యలు తీసుకున్నామని తెలిపారు.

అలాగే నాడు–నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చి, ఇంగ్లిష్ మీడియం విద్యను అందుబాటులోకి తీసుకొచ్చామని వీరాంజనేయులు పేర్కొన్నారు. ప్రతి పంచాయతీకి గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌ల ఏర్పాటుతో పాటు మండల స్థాయిలో ఆరోగ్య కేంద్రాల నిర్మాణం చేపట్టినట్లు వివరించారు.

తరిమెల గ్రామం వద్ద పెన్నా నదిపై వంతెన నిర్మాణం, నాయనవారిపల్లి–పోతురాజు కాలువ నుంచి సలకం చెరువుకు నీటి వసతి, సింగనమల నుంచి గార్లదిన్నెతో పాటు పలు గ్రామాలకు రహదారుల నిర్మాణం వంటి పనులు చేపట్టామని ఆయన తెలిపారు.

“ఈ అభివృద్ధి కార్యక్రమాలు కూటమి నాయకులకు కనిపించడం లేదా? లేక కళ్లుమూసుకుని ఉన్నారా?” అని వీరాంజనేయులు ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో ఎక్కడెక్కడ అభివృద్ధి పనులు చేపట్టారో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు.

కేవలం ఆర్భాటాలు, ప్రచార కార్యక్రమాలకే పరిమితమవుతున్నారని కూటమి ప్రభుత్వంపై ఆయన విమర్శలు చేశారు. అభివృద్ధి విషయంలో మాత్రం శూన్యంగా ఉందని ఎద్దేవా చేశారు.

ఈ సమావేశంలో సింగనమల నియోజకవర్గ యూత్ కన్వీనర్ దిద్దుకుంట భాస్కర్‌రెడ్డి, తిరుపతయ్య, వీరనారాయణ, నాగేంద్ర, సాయినాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

రిపోర్టర్ : మొయినుద్దీన్, అనంతపురం బ్యూరో, అనంతపురం.