పచ్చని పంటలతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి--ఎమ్మెల్యే ఆనందబాబు --వరుణ యాగంలో పాల్గొన్న ఎమ్మెల్యే
వేమూరు(భట్టిప్రోలు) మేజర్ న్యూస్:
పచ్చని పంటలతో రాష్ట్రం సస్యశ్యామలంగా, రైతులు సుభిక్షంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్దేశమని అందుకోసమే రాష్ట్రవ్యాప్తంగా వరుణ యాగం చేయిస్తున్నారని మాజీ మంత్రి, వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు అన్నారు. మంగళవారం వేమూరు మండలం చావలి శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ వాలేశ్వర స్వామి దేవస్థానంలో ఆలయ పాలకమండలి అధ్యక్షులు లంకోజి మల్లేశ్వరరావు ఆధ్వర్యంలో వరుణ యాగంను రు త్వికుల వేద మంత్రాలతో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే ఆనందబాబు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏలినోవా ప్రభావంతో ఈ ఏడాది అనుకున్న మేర వర్షాలు లేక సాగునీటికి రైతులు పలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని, అయినప్పటికీ రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వం సాగునీరు అందించిందని తెలిపారు.అందుకు తగిన విధంగా వర్షాలు కూడా తోడైతే రైతులకు ఎటువంటి ఇబ్బందులు ఉండవనే ఉద్దేశంతోనే కూటమి ప్రభుత్వం అన్నిచోట్ల ఒకేరోజు వరుణ యాగం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.రాష్ట్రం సస్యశ్యామలంగా రైతులు సంతోషంగా ఉండాలన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరు ఆ దేవుని ప్రార్థించాలని ఆనందబాబు తెలియజేశారు. కార్యక్రమంలో డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ దండే వెంకట సుబ్బారావు, మండల పార్టీ అధ్యక్షులు గాజుల వెంకటసుబ్బయ్య, యార్డ్ వైస్ చైర్మన్ అమ్మిశెట్టి కిషోర్, గ్రామ మాజీ సర్పంచ్ విష్ణు మొలకల శ్రీనివాసరావు, గోపాలం సుబ్బారావు, దేవాదాయ ధర్మాదాయ ఏసీ ఎం నాగయ్య,జేఏ లెనిన్ రెడ్డి,ఆలయ ఈవో నిమ్మగడ్డ వెంకట రవికుమార్,ఆలయ ప్రధాన అర్చకులు చావలి మణికంఠ, గ్రామ పురోహితుడు వీరరాఘవ శర్మ ల నేతృత్వంలో అర్చకులు వరుణ యాగాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి గోపాలం రామ బసవ ప్రసాద్,కుంచే హరి నారాయణ,గ్రామ ప్రజలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.