BREAKING
స్థానిక సంస్థలు ఎన్నికల్లో వంద శాతం కూటమి అభ్యర్థులు గెలిచేలా అందరూ కలసి పనిచేయాలి. కేశవరంలో పోషణ మాసం ముగింపు ఉత్సవం రైతులపై కేసులు నమోదు ఖండిస్తున్నాం: బి ఆర్ ఎస్ లారీల రాకపోకలపై నియంత్రణకు చర్యలు తీసుకోవాలి గుంతకల్లు డీఎస్పీకి ఎస్‌ఎఫ్‌ఐ వినతి గుర్రపు శ్రీనివాస్‌ కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్‌ఎస్‌ నాయకులు మీ కళ్లను ప్రేమించండి… కళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకోండి” కోవూరు మండలంలో పలువురు వైసీపీ నాయకులను పరామర్శించిన మాజీ మంత్రి నల్లపరెడ్డి.. ప్రజా ఆస్తుల పరిరక్షణకు నంద్యాలలో "ప్రజా భిక్షాటన"-విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చిన అఖిలపక్షం నాయకులు డిఎస్ఆర్ హైస్కూల్ లో ఉపాధ్యాయులు ,విద్యా కమిటీ,పేరెంట్స్ తో మంత్రి నారాయణ ఆత్మీయ సమావేశం. న్యాయవాదుల రక్షణ చట్టం అమలు చేయాలి కనకదుర్గమ్మ ఆలయంలో దసరా మహోత్సవాలు. తాను పక్కా సెక్యులరిస్టును.. సైనికులే అసలైన రియల్ హీరోలు: ప్రముఖ నటుడు సుమన్ సంచలన వ్యాఖ్యలు టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి లోకేష్ ప్రజాదర్బార్ ప్రజలు, టీడీపీ కార్యకర్తల నుంచి వినతుల స్వీకరణ 5,400 కోట్ల రూపాయల విద్యుత్ భారాన్ని ప్రజలపై మోపెందుకు ప్రభుత్వం కుట్ర. సైడ్ కాలువలు ధ్వంసం మాకేం పట్టదంటున్నట్లు వ్యవహరిస్తున్న మున్సిపల్ సిబ్బంది...

పేద కుటుంబాల ఎంపికపై మండల స్థాయి అవగాహన కార్యక్రమం

Select Suryaa Now
పేద కుటుంబాల ఎంపికపై మండల స్థాయి అవగాహన కార్యక్రమం

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అత్యంత పేద కుటుంబాల ఎంపికపై మండల స్థాయి అవగాహన కార్యక్రమం పొన్నూరు మండల ప్రజా  పరిషత్ కార్యాలయం నందు మంగళవారం నిర్వహించారు.గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (SERF) ఆధ్వర్యంలో ఏపీఎం జోయిబాబు అధ్యక్షతన  జరిగింది ఈ కార్యక్రమం మండల సమైక్య ఆధ్వర్యంలో  అక్టోబర్ 7, 8 తేదీలలో రెండు రోజుల పాటు జరుగుతుందని ఎపియం  జోయి బాబు తెలిపారు ఈ సందర్భంగా ఎ పి యం జోయి బాబు     మాట్లాడుతూ  ప్లానింగ్ డిపార్ట్మెంట్ నుండి వచ్చిన జాబితాను గ్రామ సంఘం సమావేశంలో చర్చించి అందులోని అనర్హులను గుర్తించి తొలగించాలని తెలిపారు అర్హత కలిగిన నిరుపేదల పేర్లను కొత్తగా చేర్చాలని సూచించారు.  ఆ జాబితాకు గ్రామసభ ఆమోదం తీసుకుని ప్రభుత్వం ఇచ్చిన యాప్ లో ఎంట్రీ చేయాల్సి ఉంటుందన్నారు.ఈ గుర్తింపు ప్రక్రియలో ప్రభుత్వం నుండి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పొందుతున్న వారు అనర్హులుగా పరిగణించబడతారని తెలిపారు.ఎంపిక చేసిన జాబితాను గ్రామ పంచాయతీ కార్యదర్శి 10 రోజుల పాటు ప్రదర్శనలో ఉంచుతారనిదానిపై ప్రజల నుండి ఏవైనా అభ్యర్థనలు అభ్యంతరాలు వస్తే వాటిని జిల్లా అధికారులదృష్టికి తీసుకెళ్లడంజరుగుతుందన్నారు.నిరుపేద కుటుంబాల ఎంపిక నిష్పక్షపాతంగా పారదర్శకంగా జరిగేలా మండల స్థాయి సిబ్బంది జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇప్పటికే పైలట్ ప్రాజెక్టుగా కొల్లిపర మండలంలో ఈ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలిపారు.మండల స్థాయి శిక్షణ అనంతరం రేపటి నుండి గ్రామాల్లో గ్రామ సంఘాలకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.