BREAKING
బాలికల హక్కులకు భరోసా - బాల్య వివాహాల నిర్మూలనకు పిలుపు ---అంతర్జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా షీ టీం ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజా దర్బార్ బీసీలకు 34 శాతం కంటే ఎక్కువ సీట్లు - సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కాపర్ వైర్ చోరీ కేసులో తమిళనాడుకు చెందిన ఇద్దరు అరెస్ట్‌! ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ప్రజాదర్బార్ శ్రీ చైతన్య టెక్నో స్కూల్‌లో ఘనంగా ముందస్తు బతుకమ్మ వేడుకలు కదిరిబాబురావు కళాశాల విద్యార్థులు రూడ్ సెట్ సంస్థ సందర్శన: బెస్ట్ టీచర్ అవార్డు గ్రహీత నైతం కృష్ణారావుకు ఘన సన్మానం టీయూడబ్ల్యూజే (ఐజేయూ) చేవెళ్ల ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడిగా పడమటి నరేందర్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక అశ్వారావుపేటలో రాష్ట్ర స్థాయి అండర్‌–20 బాలికల జూనియర్ కబడ్డీ పోటీలు హెడ్ కానిస్టేబుల్‌ను పరామర్శించిన జిల్లా ఎస్పీ జగదీష్ అదహళ్లి మహిళా సంఘాల సభ్యులు తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించాలి తవ్వారు.... వదిలేశారు సమష్టి కృషితోనే మున్సిపల్‌ విజయం విద్యుత్‌ కోతలపై రైతులతో కలిసి ధర్నా నిర్వహించిన బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కొమ్మిడి ప్రభాకర్ రెడ్డి, చిప్పలపల్లి మహేందర్ నాథ్.*

స్థానిక సంస్థలు ఎన్నికల్లో వంద శాతం కూటమి అభ్యర్థులు గెలిచేలా అందరూ కలసి పనిచేయాలి.

Select Suryaa Now
స్థానిక సంస్థలు ఎన్నికల్లో వంద శాతం కూటమి అభ్యర్థులు గెలిచేలా అందరూ కలసి పనిచేయాలి.

స్థానిక ఎన్నికలకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేయడం కోసం త్వరలోనే నియోజకవర్గ స్థాయి సమావేశాలు   నియోజకవర్గ పరిశీలకులు పార్టీ శ్రేణులతో పాటు కూటమి పార్టీలతో కూడా  సమన్వయం చేసుకోవాలి. నెల్లూరు జిల్లా పరిశీలకులు డూండీ రాకేష్

 నెల్లూరు సిటీ,మేజర్ న్యూస్ :  నెల్లూరు లోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నెల్లూరు జిల్లాకు చెందిన టిడిపి నియోజకవర్గ స్థాయి పరిశీలకుల సమావేశం జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి చేజర్ల వేంకటేశ్వర రెడ్డి అధ్యక్షతన జరిగింది.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్మన్,నెల్లూరు జిల్లా పరిశీలకులు డూండీ రాకేష్ గారు మాట్లాడుతూ   కోర్టు తీర్పు వెలువడిన వెంటనే ముందుగా మున్సిపల్ ఎన్నికలు,తరువాత మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలు,తదుపరి గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి.  నియోజకవర్గ పరిశీలకులు స్థానిక శాసనసభ్యులతో చర్చించి  రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించేందుకు అవసరమైన కార్యాచరణను రూపొందించాలి.  స్థానిక ఎన్నికలకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేయడం కోసం త్వరలోనే నియోజకవర్గ స్థాయి సమావేశాలు నిర్వహించడం జరుగుతుందని.ఈలోపుగా పరిశీలకులు మీకు కేటాయించిన నియోజకవర్గాలకు వెళ్లి గ్రామ,వార్డు స్థాయి నుండి అవసరమైన సమాచారాన్ని సేకరించాలి.   తెలుగుదేశం పార్టీ నాయకులు తో పాటు కూటమి పార్టీలతో కూడా సమన్వయం చేసుకోవాలి.అదేవిధంగా కూటమి అభ్యర్థులు విజయం సాధించడానికి రాష్ట్ర పార్టీ రూపొందించిన కార్యక్రమాలు సక్రమంగా నిర్వహించే బాధ్యత పరిశీలకులపైనే ఉంది.  గత రెండున్న సంవత్సరాల కూటమి పాలనలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాలలో దూసుకు పోతుంది.  రాష్ట్రం లో కేంద్రంలో కూటమి ప్రభుత్వం అంటే డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఉండటం వలనే ఇది సాధ్యమైంది.స్థానిక సంస్థల లో కూడా కూటమి అభ్యర్థులు విజయం సాధిస్తే త్రిబుల్ ఇంజన్ ప్రభుత్వం ఏర్పడి రాష్ట్రం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉందనే విషయాన్ని ప్రజలకు వివరించాలని కోరారు.  ఈ సమావేశంలో  జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి చేజర్ల వేంకటేశ్వర రెడ్డి,కావలి పరిశీలకులు మండవ జయంత్ బాబు, ఆత్మకూరు పరిశీలకులు శనివారం మోహన రెడ్డి, కోవూరు పరిశీలకు లు ఇమ్మపొడి రమేష్, నెల్లూరు నగర పరిశీలకులు రెడ్డివారి గురవారెడ్డి, నెల్లూరు రూరల్ పరిశీలకులు కుసుమ కుమారి, ఉదయగిరి పరిశీలకులు మేగడ ఓబుల్ రెడ్డి, కందుకూరు పరిశీలకులు మట్టం శ్రావణి, సర్వేపల్లి పరిశీలకులు జెన్ని రమణయ్య, గూడూరు పరిశీలకులు లక్ష్మీ ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.