BREAKING
కోవూరు మండలంలో పలువురు వైసీపీ నాయకులను పరామర్శించిన మాజీ మంత్రి నల్లపరెడ్డి.. ప్రజా ఆస్తుల పరిరక్షణకు నంద్యాలలో "ప్రజా భిక్షాటన"-విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చిన అఖిలపక్షం నాయకులు డిఎస్ఆర్ హైస్కూల్ లో ఉపాధ్యాయులు ,విద్యా కమిటీ,పేరెంట్స్ తో మంత్రి నారాయణ ఆత్మీయ సమావేశం. న్యాయవాదుల రక్షణ చట్టం అమలు చేయాలి కనకదుర్గమ్మ ఆలయంలో దసరా మహోత్సవాలు. తాను పక్కా సెక్యులరిస్టును.. సైనికులే అసలైన రియల్ హీరోలు: ప్రముఖ నటుడు సుమన్ సంచలన వ్యాఖ్యలు టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి లోకేష్ ప్రజాదర్బార్ ప్రజలు, టీడీపీ కార్యకర్తల నుంచి వినతుల స్వీకరణ 5,400 కోట్ల రూపాయల విద్యుత్ భారాన్ని ప్రజలపై మోపెందుకు ప్రభుత్వం కుట్ర. సైడ్ కాలువలు ధ్వంసం మాకేం పట్టదంటున్నట్లు వ్యవహరిస్తున్న మున్సిపల్ సిబ్బంది... ప్రముఖ నటుడు తనికెళ్ల భరణికి అరుదైన గౌరవం.. ఘనంగా భజరప్ప స్మారక పురస్కార ప్రదానం మానవత్వం చాటిన త్రిపురాంతకం తహసిల్దార్ వాసుదేవరావు..... గుమ్మనూరు కుటుంబ సభ్యులను మర్యాదపూర్వకంగా కలిసిన పామిడి సీఐ పుష్పగుచ్ఛం అందజేసిన నూతన సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ మనోహర్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన కంగనా రనౌత్.. ఏఐ ఫేక్ కంటెంట్‌పై సంచలన పిటిషన్ *ఓటు హక్కుపై గళమెత్తిన కాంగ్రెస్‌* ఉద్యోగం చేస్తూనే ఉన్నత విద్యలో మెరిసిన ప్రశాంత్ - బిఆర్ఎవోయు స్నాతకోత్సవంలో బంగారు పతకం

టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి లోకేష్ ప్రజాదర్బార్ ప్రజలు, టీడీపీ కార్యకర్తల నుంచి వినతుల స్వీకరణ

Select Suryaa Now
టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి లోకేష్ ప్రజాదర్బార్  ప్రజలు, టీడీపీ కార్యకర్తల నుంచి వినతుల స్వీకరణ

విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ గురువారం ఉదయం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. వివిధ సమస్యలపై పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన ప్రజలు, కార్యకర్తలను కలుసుకున్నారు. వారి నుంచి అర్జీలు స్వీకరించారు. రాష్ట్రంలో గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయ వ్యవస్థలో విధులు నిర్వహిస్తున్న సంక్షేమ, విద్యా సహాయకులకు ప్రమోషన్ ఛానల్ కల్పించడంతో పాటు విద్యాశాఖలో పదోన్నతి అవకాశాలు కల్పించాలని వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. గిరిజన బంజారా తండాల్లోని గుడి పూజారులకు నెలకు రూ.15వేల గౌరవ వేతనం మంజూరు చేయడంతో పాటు బంజారా దేవాలయాలకు ధూప, దీప, నైవేద్య పథకాన్ని వర్తింపజేయాలని బంజారా ధర్మ రక్షా సమితి ప్రతినిధులు కోరారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గోపాలమిత్రలకు ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు గౌరవ వేతనం పెంచాలని రాష్ట్ర గోపాలమిత్ర సర్వీస్ అసోసియేషన్ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. చిత్తూరు జిల్లా గుడుపల్లి మండలం చీకటిపల్లె గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణంతో పాటు శ్మశాన వాటికకు బీటీ రోడ్డు నిర్మించాలని సి.విజయ కుమార్ కోరారు. ఆయా వినతులను పరిశీలించి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.