గుమ్మనూరు కుటుంబ సభ్యులను మర్యాదపూర్వకంగా కలిసిన పామిడి సీఐ పుష్పగుచ్ఛం అందజేసిన నూతన సర్కిల్ ఇన్‌స్పెక్టర్ మనోహర్
అనంతపురం బ్యూరో : పామిడి పట్టణ నూతన సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన శ్రీ మనోహర్ మర్యాదపూర్వకంగా గుమ్మనూరు కుటుంబ సభ్యులను కలిశారు. ఈ సందర్భంగా ఆలూరు పట్టణంలో గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం సోదరుడు, గుంతకల్లు మండల ఇన్‌చార్జి గుమ్మనూరు నారాయణస్వామిని, ఎమ్మెల్యే తనయుడు, గుత్తి–పామిడి నియోజకవర్గ ఇన్‌చార్జి గుమ్మనూరు ఈశ్వర్‌ను సీఐ మనోహర్ కలిశారు.
ఈ సందర్భంగా వారికి పుష్పగుచ్ఛం అందజేసి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. పామిడి సర్కిల్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించే అంశాలపై సీఐగా మనోహర్ బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో ఈ మర్యాదపూర్వక భేటీ జరిగింది.
రిపోర్టర్ : మొయినుద్దీన్, అనంతపురం బ్యూరో, అనంతపురం.