BREAKING
కోవూరు మండలంలో పలువురు వైసీపీ నాయకులను పరామర్శించిన మాజీ మంత్రి నల్లపరెడ్డి.. ప్రజా ఆస్తుల పరిరక్షణకు నంద్యాలలో "ప్రజా భిక్షాటన"-విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చిన అఖిలపక్షం నాయకులు డిఎస్ఆర్ హైస్కూల్ లో ఉపాధ్యాయులు ,విద్యా కమిటీ,పేరెంట్స్ తో మంత్రి నారాయణ ఆత్మీయ సమావేశం. న్యాయవాదుల రక్షణ చట్టం అమలు చేయాలి కనకదుర్గమ్మ ఆలయంలో దసరా మహోత్సవాలు. తాను పక్కా సెక్యులరిస్టును.. సైనికులే అసలైన రియల్ హీరోలు: ప్రముఖ నటుడు సుమన్ సంచలన వ్యాఖ్యలు టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి లోకేష్ ప్రజాదర్బార్ ప్రజలు, టీడీపీ కార్యకర్తల నుంచి వినతుల స్వీకరణ 5,400 కోట్ల రూపాయల విద్యుత్ భారాన్ని ప్రజలపై మోపెందుకు ప్రభుత్వం కుట్ర. సైడ్ కాలువలు ధ్వంసం మాకేం పట్టదంటున్నట్లు వ్యవహరిస్తున్న మున్సిపల్ సిబ్బంది... ప్రముఖ నటుడు తనికెళ్ల భరణికి అరుదైన గౌరవం.. ఘనంగా భజరప్ప స్మారక పురస్కార ప్రదానం మానవత్వం చాటిన త్రిపురాంతకం తహసిల్దార్ వాసుదేవరావు..... గుమ్మనూరు కుటుంబ సభ్యులను మర్యాదపూర్వకంగా కలిసిన పామిడి సీఐ పుష్పగుచ్ఛం అందజేసిన నూతన సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ మనోహర్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన కంగనా రనౌత్.. ఏఐ ఫేక్ కంటెంట్‌పై సంచలన పిటిషన్ *ఓటు హక్కుపై గళమెత్తిన కాంగ్రెస్‌* ఉద్యోగం చేస్తూనే ఉన్నత విద్యలో మెరిసిన ప్రశాంత్ - బిఆర్ఎవోయు స్నాతకోత్సవంలో బంగారు పతకం

కనకదుర్గమ్మ ఆలయంలో దసరా మహోత్సవాలు.

Select Suryaa Now
కనకదుర్గమ్మ ఆలయంలో దసరా మహోత్సవాలు.

గన్నవరం, మేజర్ న్యూస్. 

  బుద్ధవరం పంచాయతీ, గన్నవరం శివారు ప్రాంతంలోని శ్రీ గణపతి, శ్రీ సుబ్రహ్మణ్య సహిత శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు దసరా మహోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ నెల 11న ఆదివారం ఉదయం 9.09 గంటలకు అమ్మవారి కలశస్థాపనతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. అదే రోజు తెల్లవారుజామున 5 గంటలకు మంగళస్నానం, అభిషేకం, అఖండజ్యోతి ప్రజ్వలన, హోమం, అంకురార్పణ, కంకణధారణ తదితర కార్యక్రమాలను ఆలయ ప్రధాన అర్చకులు పండితులు శ్రీమాన్ శ్రీ శ్రీ శ్రీ దిలీప్‌కుమార్ ఆచార్యులు నిర్వహించనున్నారు. ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ ఉదయం 8.30 గంటలకు ప్రత్యేక పూజలు, సహస్ర కుంకుమార్చన, లక్ష్మీ గణపతి హోమం, నవగ్రహ హోమం, దుర్గాహోమం నిర్వహిస్తారు. సాయంత్రం 6 గంటలకు దీపోత్సవం, అష్టోత్తర శతనామావళి, లలితా పారాయణం జరుగుతాయి. ఈ నెల 20న మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు మహాపూర్ణాహుతి, మధ్యాహ్నం 3 గంటలకు శమీ పూజ అనంతరం అమ్మవారి ఊరేగింపు నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు.

గుర్రం ప్రసాద్, గన్నవరం, కృష్ణాజిల్లా..