BREAKING
లారీల రాకపోకలపై నియంత్రణకు చర్యలు తీసుకోవాలి గుంతకల్లు డీఎస్పీకి ఎస్‌ఎఫ్‌ఐ వినతి గుర్రపు శ్రీనివాస్‌ కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్‌ఎస్‌ నాయకులు మీ కళ్లను ప్రేమించండి… కళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకోండి” కోవూరు మండలంలో పలువురు వైసీపీ నాయకులను పరామర్శించిన మాజీ మంత్రి నల్లపరెడ్డి.. ప్రజా ఆస్తుల పరిరక్షణకు నంద్యాలలో "ప్రజా భిక్షాటన"-విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చిన అఖిలపక్షం నాయకులు డిఎస్ఆర్ హైస్కూల్ లో ఉపాధ్యాయులు ,విద్యా కమిటీ,పేరెంట్స్ తో మంత్రి నారాయణ ఆత్మీయ సమావేశం. న్యాయవాదుల రక్షణ చట్టం అమలు చేయాలి కనకదుర్గమ్మ ఆలయంలో దసరా మహోత్సవాలు. తాను పక్కా సెక్యులరిస్టును.. సైనికులే అసలైన రియల్ హీరోలు: ప్రముఖ నటుడు సుమన్ సంచలన వ్యాఖ్యలు టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి లోకేష్ ప్రజాదర్బార్ ప్రజలు, టీడీపీ కార్యకర్తల నుంచి వినతుల స్వీకరణ 5,400 కోట్ల రూపాయల విద్యుత్ భారాన్ని ప్రజలపై మోపెందుకు ప్రభుత్వం కుట్ర. సైడ్ కాలువలు ధ్వంసం మాకేం పట్టదంటున్నట్లు వ్యవహరిస్తున్న మున్సిపల్ సిబ్బంది... ప్రముఖ నటుడు తనికెళ్ల భరణికి అరుదైన గౌరవం.. ఘనంగా భజరప్ప స్మారక పురస్కార ప్రదానం మానవత్వం చాటిన త్రిపురాంతకం తహసిల్దార్ వాసుదేవరావు..... గుమ్మనూరు కుటుంబ సభ్యులను మర్యాదపూర్వకంగా కలిసిన పామిడి సీఐ పుష్పగుచ్ఛం అందజేసిన నూతన సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ మనోహర్

ప్రజా ఆస్తుల పరిరక్షణకు నంద్యాలలో "ప్రజా భిక్షాటన"-విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చిన అఖిలపక్షం నాయకులు

Select Suryaa Now
ప్రజా ఆస్తుల పరిరక్షణకు నంద్యాలలో "ప్రజా భిక్షాటన"-విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చిన అఖిలపక్షం నాయకులు

సూర్య, నంద్యాల బ్యూరో:
ప్రజా ఆస్తుల పరిరక్షణ కోసం నంద్యాల అఖిలపక్ష ఐక్యవేదిక ఆధ్వర్యంలో రేపు అనగా శుక్రవారం ఉదయం 9.30 గంటలకు గాంధీ చౌక్‌లో “ప్రజా భిక్షాటన” కార్యక్రమం నిర్వహించనున్నట్లు అఖిలపక్ష ఐక్యవేదిక కన్వీనర్ ఏరువ రామచంద్రారెడ్డి ప్రకటించారు. గురువారం నంద్యాల రాయలసీమ సాగునీటి సాధన సమితి ప్రధాన కార్యాలయంలో సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి, ఏరువ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ నూనెపల్లె మార్కెట్ యార్డు భూమిలో రెండు ఎకరాలను రాజకీయ పార్టీకి కేటాయించడాన్ని రద్దు చేయడం, ఆర్ఏఆర్ఎస్ ప్రాంగణంలోని తాత్కాలిక కలెక్టరేట్‌ను అక్కడి నుంచి తరలించడం ప్రధాన డిమాండ్లుగా ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు వారు తెలిపారు. రెండు ఎకరాల భూమిని 33 సంవత్సరాలకు కేటాయించడం ద్వారా ప్రభుత్వానికి లభించేది కేవలం ₹66,000 మాత్రమేనని పేర్కొంటూ, ఆ ₹66,000 మొత్తాన్ని ప్రజల నుంచి భిక్షాటన రూపంలో సమీకరించి ప్రభుత్వానికి అందజేయడం ద్వారా ప్రజా ఆస్తులను కాపాడుకోవడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని వారు స్పష్టం చేశారు.
అదేవిధంగా, ఆర్ఏఆర్ఎస్ నుంచి తాత్కాలిక కలెక్టరేట్‌ను తరలించేందుకు అవసరమైన నిధులను కూడా ప్రజల నుంచి సమీకరించేందుకు కూఅ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నంద్యాల ప్రజలు, రైతులు, విద్యార్థులు, యువత, కార్మికులు, ప్రజా సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని “ప్రజా భిక్షాటన” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు ప్రజలకు పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో నిట్టూరు సుధాకర్ రావు, బిజ్జల కృష్ణమోహన్ రెడ్డి పాల్గొన్నారు.
*మధుబాబు, సూర్య బ్యూరో ఇంచార్జి, నంద్యాల జిల్లా*