సైడ్ కాలువలు ధ్వంసం మాకేం పట్టదంటున్నట్లు వ్యవహరిస్తున్న మున్సిపల్ సిబ్బంది...
మార్కాపురం పట్టణంలోని విద్యానగర్ లో నూతన సాగర్ పైప్ లైన్ వేశారు.మున్సిపల్ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో మురుగు కాలువ ఉన్న వైపున వారికి ఇష్టానుసారంగా కాలువలు తీసి పైపులు వేసి పూడ్చివేశారు. దీంతో పక్కనే ఉన్న మురుగు కాలువ చిన్న భిన్నం అయిపోయింది. అసలే మురుగు కాలవలు లేని సమయంలో గృహ యజమానులు సొంతంగా నిర్మించుకున్న కాలువలను గందరగోళం చేశారు. మునిసిపల్ అధికారులకు తెలియజేసినప్పటికీ నిమ్మకు నీరు ఎత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. మాకేం సంబంధం లేదు సచివాలయంలో తెలియజేయాలని స్థానికంగా ఉన్న వారికి సమాధానం ఇచ్చారు. సచివాలయంలో తెలియజేయగా వచ్చి పరిశీలించారే గాని ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో విద్యానగర్ రెండో లైను మొదలుకొని చివరి వరకు ఒకే మురుగు కాలువ కావడంతో మురుగునీరు మొత్తం కాలువ ద్వంశమైన చోట బ్లాక్ అయిపోయింది దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనంతటికీ కారణం మున్సిపల్ అధికారులు పర్యవేక్షణ లేకపోవడం వల్లే వారి ఇష్టానుసారం ఎలా బడితే అలాగా సాగర్ పైపులు వేసి మామ అనిపించారని స్థానికులు ఆరోపించారు. సంబంధిత ఉన్నత అధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.