న్యాయవాదుల రక్షణ చట్టం అమలు చేయాలి
*న్యాయవాదుల రక్షణ చట్టం అమలు చేయాలి*
_జగ్గయ్యపేట కోర్టు ఎదుట రిలే దీక్ష_
_రేపు బార్ సెక్రటరీ లక్ష్మీనారాయణ ఆమరణ దీక్ష_
జగ్గయ్యపేట మేజర్ న్యూస్ :-న్యాయవాదుల రక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జగ్గయ్యపేట బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం కోర్టు ఎదుట ఒకరోజు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ న్యాయవాదులపై దాడులు విపరీతంగా పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయవాదిపై దాడి అంటే న్యాయవ్యవస్థపై చేసినట్లేనని మండిపడ్డారు. న్యాయవాదుల ఆత్మస్థైర్యం దెబ్బతింటే వృత్తిని సరిగ్గా నిర్వహించలేమని.. క్లయింట్లకు సరైన న్యాయం చేయలేమని అన్నారు. పక్క రాష్ట్రాల్లో ఇప్పటికే న్యాయవాదుల రక్షణ చట్టం అమలు జరుగుతుంటే ఆంధ్రప్రదేశ్‌లో ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి చట్టాన్ని అమలు చేసి తమకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. చట్టం అమలయ్యే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. కాగా ఈ డిమాండ్‌తో గురువారం జగ్గయ్యపేట బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఆర్వీ లక్ష్మీనారాయణ ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రతినిధులు, సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.