BREAKING
మీ కళ్లను ప్రేమించండి… కళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకోండి” కోవూరు మండలంలో పలువురు వైసీపీ నాయకులను పరామర్శించిన మాజీ మంత్రి నల్లపరెడ్డి.. ప్రజా ఆస్తుల పరిరక్షణకు నంద్యాలలో "ప్రజా భిక్షాటన"-విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చిన అఖిలపక్షం నాయకులు డిఎస్ఆర్ హైస్కూల్ లో ఉపాధ్యాయులు ,విద్యా కమిటీ,పేరెంట్స్ తో మంత్రి నారాయణ ఆత్మీయ సమావేశం. న్యాయవాదుల రక్షణ చట్టం అమలు చేయాలి కనకదుర్గమ్మ ఆలయంలో దసరా మహోత్సవాలు. తాను పక్కా సెక్యులరిస్టును.. సైనికులే అసలైన రియల్ హీరోలు: ప్రముఖ నటుడు సుమన్ సంచలన వ్యాఖ్యలు టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి లోకేష్ ప్రజాదర్బార్ ప్రజలు, టీడీపీ కార్యకర్తల నుంచి వినతుల స్వీకరణ 5,400 కోట్ల రూపాయల విద్యుత్ భారాన్ని ప్రజలపై మోపెందుకు ప్రభుత్వం కుట్ర. సైడ్ కాలువలు ధ్వంసం మాకేం పట్టదంటున్నట్లు వ్యవహరిస్తున్న మున్సిపల్ సిబ్బంది... ప్రముఖ నటుడు తనికెళ్ల భరణికి అరుదైన గౌరవం.. ఘనంగా భజరప్ప స్మారక పురస్కార ప్రదానం మానవత్వం చాటిన త్రిపురాంతకం తహసిల్దార్ వాసుదేవరావు..... గుమ్మనూరు కుటుంబ సభ్యులను మర్యాదపూర్వకంగా కలిసిన పామిడి సీఐ పుష్పగుచ్ఛం అందజేసిన నూతన సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ మనోహర్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన కంగనా రనౌత్.. ఏఐ ఫేక్ కంటెంట్‌పై సంచలన పిటిషన్ *ఓటు హక్కుపై గళమెత్తిన కాంగ్రెస్‌*

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన కంగనా రనౌత్.. ఏఐ ఫేక్ కంటెంట్‌పై సంచలన పిటిషన్

Select Suryaa Now
ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన కంగనా రనౌత్.. ఏఐ ఫేక్ కంటెంట్‌పై సంచలన పిటిషన్

సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: ప్రముఖ నటి, హిమాచల్ ప్రదేశ్‌లోని మండి లోక్‌సభ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సోషల్ మీడియా వేదికగా తనపై ప్రచారం అవుతున్న కొన్ని అసభ్యకరమైన, అశ్లీల కంటెంట్‌తో పాటు కృత్రిమ మేధస్సు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సృష్టించిన నకిలీ కంటెంట్‌ను పూర్తిగా తొలగించాలని కోరుతూ ఆమె ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇంటర్నెట్‌లో తన వ్యక్తిత్వ హక్కులకు భంగం కలిగించేలా, పరువుకు నష్టం చేకూర్చేలా కొందరు కావాలనే ఇలాంటి దుష్ప్రచారానికి పాల్పడుతున్నారని ఆమె తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు.

గురువారం ఈ అంశంపై విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వికాస్ మహాజన్ ధర్మాసనం ప్రతివాదులకు అధికారికంగా సమన్లు జారీ చేసింది. ఇంటర్నెట్‌లో తనకు సంబంధించిన లైంగిక, అసభ్యకర కంటెంట్‌తో పాటు తాను ఎప్పుడూ మాట్లాడని మాటలను సైతం చెప్పినట్లుగా క్రియేట్ చేసి ఫేక్ న్యూస్, మార్ఫింగ్ వీడియోలు వైరల్ చేస్తున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందించిన కోర్టు త్వరలోనే తగిన మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. సెలబ్రిటీల వ్యక్తిగత వివరాలు, వారి ఇమేజ్‌ను అనుమతి లేకుండా వాణిజ్యపరంగా లేదా సోషల్ మీడియాలో దుర్వినియోగం చేయడంపై న్యాయస్థానాలు ఇటీవల కఠిన వైఖరి ప్రదర్శిస్తున్నాయి.

ఇదే విచారణ సందర్భంగా టాలీవుడ్ ప్రముఖ హీరో విజయ్ దేవరకొండ దాఖలు చేసిన వ్యక్తిత్వ హక్కుల రక్షణ కేసుకు సంబంధించిన అంశాన్ని కూడా ఢిల్లీ హైకోర్టు ప్రస్తావించడం విశేషం. విజయ్ దేవరకొండ వ్యక్తిత్వాన్ని, ఆయన ఇమేజ్‌ను ఎటువంటి అనుమతి లేకుండా వాణిజ్యపరంగా కొందరు దుర్వినియోగం చేస్తున్నారని ఆయన తరఫు న్యాయవాది గతంలోనే కోర్టుకు నివేదించారు. సెలబ్రిటీల పర్సనాలిటీ రైట్స్‌కు రక్షణ కల్పించాలని కోరుతూ దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్న జాబితాలో ఇప్పుడు కంగనా రనౌత్ కూడా చేరారు.

భారతీయ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నటీనటులతో పాటు ఇతర రంగాల ప్రముఖులు సైతం తమ వ్యక్తిత్వ హక్కుల పరిరక్షణ కోసం కోర్టులను ఆశ్రయిస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్ ప్రముఖులు ఐశ్వర్య రాయ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, సల్మాన్ ఖాన్, అలాగే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, నటుడు పవన్ కల్యాణ్ తదితరులు సైతం తమ పర్సనాలిటీ రైట్స్ కోసం న్యాయస్థానాలను ఆశ్రయించి రక్షణ పొందారు. వీరితో పాటు ఆర్ట్ ఆఫ్ వింగ్ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్, పాడ్‌కాస్టర్ రాజ్ శమానీ, క్రికెటర్ అభిషేక్ శర్మ కూడా ఇదే తరహాలో కోర్టును ఆశ్రయించగా, న్యాయస్థానాలు వారికి అనుకూలంగా మధ్యంతర రక్షణ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.