కేశవరంలో పోషణ మాసం ముగింపు ఉత్సవం
నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరం
ఐసీడీఎస్ ప్రాజెక్టు సీడీపీఓ యు. పూర్ణిమ అధ్యక్షతన, కేశవరం పంచాయతీ ఆధ్వర్యంలో పోషణ మాసం ముగింపు ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీడీపీఓ పూర్ణిమ మాట్లాడుతూ పిల్లల్లో పోషకాహార లోపాన్ని నివారించేందుకు సమతుల్యమైన, వైవిధ్యమైన ఆహారాన్ని అందించాల్సిన అవసరం ఉందని తెలిపారు. పోషకాహారంపై తల్లిదండ్రులు, ప్రజలు అవగాహన పెంచుకోవాలని సూచించారు.
పీహెచ్‌సీ వైద్యుడు డాక్టర్ సునీల్ పోషకాహారం, ఆరోగ్యం, రక్తహీనత, వ్యక్తిగత పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. పోషణ మాసం కార్యక్రమాలు నేటితో ముగిసినప్పటికీ ఆరోగ్యకరమైన సమాజం కోసం పోషకాహారంపై అవగాహన కార్యక్రమాలను నిరంతరం కొనసాగించాలని అధికారులు సూచించారు. ఇరవై మంది కి సీమంతలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కూటమి నాయకులు ప్రశంసించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, మాజీ ఎంపీపీ ఉండమట్ల వాసు జనసేన నాయకులు, సొసైటీ అధ్యక్షులు ఉండమట్ల శ్రీనివాస్, టిడిపి మండల అధ్యక్షుడు కర్రీ తాతారావు, టిడిపి నాయకులు కంటిపూడి శ్రీనివాసరావు ,కేశవరం కార్యదర్శి సుబ్బారావు, అంగన్‌వాడీ సిబ్బంది, ఆరోగ్య సిబ్బంది, శ్రమ ఆర్గనైజర్ నాగేశ్వరి, ఐటీసీ, ప్రథం, స్కిల్ డెవలప్‌మెంట్, వాప్స్ సంస్థల ప్రతినిధులు, గర్భిణులు, బాలింతలు, తల్లులు పాల్గొన్నారు