రేపు మంద కృష్ణ మాదిగ గిద్దలూరు రాక
శుక్రవారం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (MRPS) వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ గిద్దలూరు రానున్నారని గిద్దలూరు నియోజకవర్గ MSP ఇంచార్జ్ కొండేపోగు దేవ ప్రభాకర్ మరియు ప్రోగ్రామ్ ఇంచార్జి, MSP జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్ YK విశ్వనాధ్ తెలిపారు. ఇటీవల ప్రకాశం జిల్లా, సింగరాయకొండ మండలం లోని శ్రీ చైతన్య స్కూల్ లో చదువుచున్న సయ్యద్ తౌషిద్ మరియు అతని తల్లి మౌలాబీ మరణానికి కారణమైన శ్రీ చైతన్య స్కూల్ యాజమాన్యం ను అరెస్టు చేయాలనే డిమాండ్ తో ఈనెల 12 న ఒంగోలు లో కలెక్టరేట్ వద్ద తలపెట్టిన భారీ ధర్నా ను జయప్రదం చేయాలనే కార్యక్రమంలో భాగంగా, శుక్రవారం గిద్దలూరు పట్టణం లోని షాదిఖానా లో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్య అతిధిగా మంద కృష్ణ మాదిగ హాజరు కానున్నారని, ఈ సమావేశానికి గిద్దలూరు నియోజకవర్గం లోని ముస్లిం మైనారిటీ, దళిత బహుజన సంఘాల నాయకులు, ప్రజాస్వామ్య వాదులు భారీగా హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని దేవ ప్రభాకర్ కోరారు.