నకరికల్లు విద్యుత్ కార్యాలయంలో సోలార్ రూఫ్‌టాప్ రిజిస్ట్రేషన్
నకరికల్లు మేజర్ న్యూస్ : ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం కింద నకరికల్లు విద్యుత్ కార్యాలయంలో గురువారం సోలార్ రూఫ్‌టాప్ రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. వినియోగదారులకు ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఉచితంగా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రిజిస్ట్రేషన్ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. రిజిస్ట్రేషన్ కోసం ఆధార్ కార్డు, విద్యుత్ సర్వీస్ నంబర్ లేదా తాజా విద్యుత్ బిల్లు, బ్యాంకు పాస్‌బుక్ మొదటి పేజీ, ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్ తీసుకురావాలని సూచించారు.
ఇళ్లపై సోలార్ విద్యుత్ వ్యవస్థ ఏర్పాటు చేసుకోవడం ద్వారా విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించుకోవచ్చని అధికారులు తెలిపారు. అర్హులైన విద్యుత్ వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సోలార్ విద్యుత్ వినియోగంతో విద్యుత్ పొదుపుతో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా దోహదపడుతుందని పేర్కొన్నారు.