BREAKING
లయన్స్ క్లబ్ స్వాగత బోర్డులు ఏర్పాటు ఇసుక లారీల దుమ్ముతో వ్యాపారుల ఇక్కట్లు విద్యార్థుల క్రీడాభివృద్దే నా లక్ష్యం విద్యార్థిని విద్యార్థులకు స్పోర్ట్స్ సామాగ్రి అందజేసిన కొవ్వాసు జగదీశ్వరి టీడీపీ పార్టీ కి రాజీనామా చేసిన మాజీ జడ్పీటీసీ చిన్నప్పయ* .? *పెనుకొండ నియోజకవర్గం లో టీడీపీ పార్టీ నీ వీడనున్న మరికొంత మంది నాయకులు?* గ్రామీణుల ఆరోగ్యమే ప్రాధాన్యత.. ప్రతి పేదవాడికి వైద్యం అందుబాటులోకి తేవడమే ప్రజా ప్రభుత్వం లక్ష్యం: పేద కుటుంబాల ఎంపికపై మండల స్థాయి అవగాహన కార్యక్రమం మల్లాపూర్‌లో గిరిజన మినీ గురుకులం,మోడల్ స్కూల్‌ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ గట్టు పై ఘాట్ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన మున్సిపల్ కార్మికుల వేతనాల చెల్లింపులో ప్రతి నెల లక్షల రూపాయల స్కాం స్థలాల కోసం బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు బంజేయ్.. సాధారణ ఆడియో లాంచ్‌కు దూరంగా జైలర్ 2 టీమ్.. ఓటీటీలో గ్రాండ్‌గా సూపర్ షో ప్రసారం! పార్టీ ఐడీ కార్డు అందుకున్న బీసీ సెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్ మైసమ్మ ఆలయ నిర్మాణానికి మల్లేశం రూ.21 వేల విరాళం మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ పిలుపు కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ . రికార్డు స్థాయి డిమాండ్.. అయినా నాణ్యమైన విద్యుత్ సరఫరా: భట్టి

మల్లాపూర్‌లో గిరిజన మినీ గురుకులం,మోడల్ స్కూల్‌ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

Select Suryaa Now
మల్లాపూర్‌లో గిరిజన మినీ గురుకులం,మోడల్ స్కూల్‌ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

 సూర్య జగిత్యాల, ప్రతినిధి:మల్లాపూర్ మండలంలోని గిరిజన మినీ గురుకులం, టీజీ మోడల్ స్కూల్‌ను జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ బుధవారం సందర్శించి, విద్యార్థులకు అందుతున్న విద్య, వసతి, భోజనం, మౌలిక వసతులను పరిశీలించారు.ఈ సందర్భంగా పాఠశాలలోని తరగతి గదులు, విద్యార్థుల హాజరు, బోధనా విధానం, విద్యార్థుల విద్యా ప్రగతి, తాగునీరు, పారిశుద్ధ్య నిర్వహణ తదితర అంశాలను  పరిశీలించారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి విద్యా పరిస్థితులు, పాఠశాలలో అందుతున్న సౌకర్యాలు, భోజనం తదితర అంశాలపై వివరాలు తెలుసుకున్నారు.విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఆరోగ్యకరమైన వాతావరణం, మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు  సూచించారు. పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు.విద్యార్థుల హాజరు, ఉపాధ్యాయుల హాజరు, బోధనా ప్రమాణాలను నిరంతరం పర్యవేక్షించాలని, విద్యార్థులలో విద్యా సామర్థ్యాలు పెంపొందించేలా ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న భోజనం నాణ్యతను ఎప్పటికప్పుడు పరిశీలించాలని తెలిపారు.విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి విద్యా సంస్థల్లో అవసరమైన అన్ని వసతులను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు, ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరచాలని  అధికారులను ఆదేశించారు.ఈ పరిశీలనలో జిల్లా ట్రైబల్ వెల్ఫెర్ ఆఫీసర్ పల్లికొండ నరేష్, జిల్లా విద్యాధికారి కె. రాము, తహసీల్దార్, ఎంపిడివో, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు మరియు తదితరులు పాల్గొన్నారు.