తాండూర్ కిచ్చన్నపేట సొసైటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం.
సూర్య, నాగిరెడ్డి పేట్:మండలంలోని తాండూర్ కిచ్చన్నపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నూతన పాలకవర్గం బుధవారం సోసైటీ కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేసింది. సొసైటీ నూతన అధ్యక్షుడిగా నియామకమైన బొగుడమీది శ్రీధర్ గౌడ్ తోపాటు 12మంది డైరెక్టర్లు ఎల్లారెడ్డి క్లస్టర్ సహకార సంఘాల అసిస్టెంట్ రిజిస్ట్రార్ కే.లక్ష్మణ్ సమక్షంలో ప్రమాణస్వీకారం చేశారు. నూతన అధ్యక్షుడిగా బొగుడమీది శ్రీధర్ గౌడ్, డైరెక్టర్లుగా భూమా భూపతి గౌడ్, మ్యాదరి లక్ష్మి, భూమ శివరాములు, పెద్ద పోచవ్వ, భూమని చిన్న దుర్గయ్య, మునిగేపల్లి సంగయ్య, జంబికుంట జీవయ్య, బోరంచ సుశీల, కొర్ర వర్జానాయక్, లంబాడి తుల్జా, ఖానాపురం నర్సమ్మ, గడ్డం భాస్కర్ రెడ్డి, లు ప్రమాణస్వీకారం చేశారు.
ప్రమాణ స్వీకారం అనంతరం నూతన పాలకవర్గాన్ని సొసైటీ సిబ్బంది ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు బొగుడమీది శ్రీధర్ గౌడ్, మాట్లాడుతూ.. సహకార సంఘం అభివృద్ధే ధ్యేయంగా నిరంతరం కృషి చేస్తానని రైతులకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, సొసైటీ అభివృద్ధికి నిబద్ధతతో పనిచేస్తామని పేర్కొన్నారు. తనను అధ్యక్షుడిగా నియామకం చేసిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావుకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ రజిత, ఇన్చార్జ్ తహసీల్దార్ వెంకట్రెడ్డి, ఆర్ఐ అజయ్, సొసైటీ సీఈవో మురళి, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు మురళి మోహన్ గౌడ్, ఆయా గ్రామాల సర్పంచులు, ప్రజా ప్రతినిధులు, రైతులు, సొసైటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.