BREAKING
లారీల రాకపోకలపై నియంత్రణకు చర్యలు తీసుకోవాలి గుంతకల్లు డీఎస్పీకి ఎస్‌ఎఫ్‌ఐ వినతి గుర్రపు శ్రీనివాస్‌ కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్‌ఎస్‌ నాయకులు మీ కళ్లను ప్రేమించండి… కళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకోండి” కోవూరు మండలంలో పలువురు వైసీపీ నాయకులను పరామర్శించిన మాజీ మంత్రి నల్లపరెడ్డి.. ప్రజా ఆస్తుల పరిరక్షణకు నంద్యాలలో "ప్రజా భిక్షాటన"-విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చిన అఖిలపక్షం నాయకులు డిఎస్ఆర్ హైస్కూల్ లో ఉపాధ్యాయులు ,విద్యా కమిటీ,పేరెంట్స్ తో మంత్రి నారాయణ ఆత్మీయ సమావేశం. న్యాయవాదుల రక్షణ చట్టం అమలు చేయాలి కనకదుర్గమ్మ ఆలయంలో దసరా మహోత్సవాలు. తాను పక్కా సెక్యులరిస్టును.. సైనికులే అసలైన రియల్ హీరోలు: ప్రముఖ నటుడు సుమన్ సంచలన వ్యాఖ్యలు టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి లోకేష్ ప్రజాదర్బార్ ప్రజలు, టీడీపీ కార్యకర్తల నుంచి వినతుల స్వీకరణ 5,400 కోట్ల రూపాయల విద్యుత్ భారాన్ని ప్రజలపై మోపెందుకు ప్రభుత్వం కుట్ర. సైడ్ కాలువలు ధ్వంసం మాకేం పట్టదంటున్నట్లు వ్యవహరిస్తున్న మున్సిపల్ సిబ్బంది... ప్రముఖ నటుడు తనికెళ్ల భరణికి అరుదైన గౌరవం.. ఘనంగా భజరప్ప స్మారక పురస్కార ప్రదానం మానవత్వం చాటిన త్రిపురాంతకం తహసిల్దార్ వాసుదేవరావు..... గుమ్మనూరు కుటుంబ సభ్యులను మర్యాదపూర్వకంగా కలిసిన పామిడి సీఐ పుష్పగుచ్ఛం అందజేసిన నూతన సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ మనోహర్

రైతుల వడ్ల కొనుగోళ్లకు అడ్డంకులు సృష్టించొద్దు

Select Suryaa Now
రైతుల వడ్ల కొనుగోళ్లకు అడ్డంకులు సృష్టించొద్దు

సూర్య,మాక్లూర్ :రైతులు తమ పంటను అధిక ధరకు కొనుగోలు చేసే వ్యాపారులకు విక్రయించుకునే స్వేచ్ఛ కల్పించాలని మాక్లూర్ మండల బీఆర్‌ఎస్ అధ్యక్షుడు గోపు రంజిత్ కుమార్ డిమాండ్ చేశారు.బోధన్, నవీపేట్, ఆర్మూర్ నియోజకవర్గ పరిధిలోని నందిపేట్, మాక్లూర్ తదితర ప్రాంతాల్లో మహారాష్ట్రకు చెందిన వ్యాపారులు రైతుల నుంచి క్వింటాల్ వడ్లను రూ.3800 వరకు కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. అయితే ఇతర రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యాపారులు రైతుల నుంచి వడ్లు కొనుగోలు చేయకుండా కొందరు రైస్ మిల్లర్లు అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపించారు.
రైతులకు ఎక్కువ ధర లభించే అవకాశాలను అడ్డుకోవడం సరికాదని, ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న రైస్ మిల్లర్లపై అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. రైతులు తమకు నచ్చిన వ్యాపారికి, ఎక్కువ ధర చెల్లించే వారికి పంటను విక్రయించుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు.బోధన్ ఎమ్మెల్యే, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి వెంటనే చొరవ తీసుకుని రైతులకు న్యాయం చేయాలని గోపు రంజిత్ కుమార్ కోరారు. రైతుల కొనుగోళ్లకు ఎవరైనా అడ్డంకులు సృష్టిస్తే, రైతులంతా ఏకమై ఆయా రైస్ మిల్లుల వద్దకు వచ్చి నిరసన చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు.