BREAKING
మీ కళ్లను ప్రేమించండి… కళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకోండి” కోవూరు మండలంలో పలువురు వైసీపీ నాయకులను పరామర్శించిన మాజీ మంత్రి నల్లపరెడ్డి.. ప్రజా ఆస్తుల పరిరక్షణకు నంద్యాలలో "ప్రజా భిక్షాటన"-విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చిన అఖిలపక్షం నాయకులు డిఎస్ఆర్ హైస్కూల్ లో ఉపాధ్యాయులు ,విద్యా కమిటీ,పేరెంట్స్ తో మంత్రి నారాయణ ఆత్మీయ సమావేశం. న్యాయవాదుల రక్షణ చట్టం అమలు చేయాలి కనకదుర్గమ్మ ఆలయంలో దసరా మహోత్సవాలు. తాను పక్కా సెక్యులరిస్టును.. సైనికులే అసలైన రియల్ హీరోలు: ప్రముఖ నటుడు సుమన్ సంచలన వ్యాఖ్యలు టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి లోకేష్ ప్రజాదర్బార్ ప్రజలు, టీడీపీ కార్యకర్తల నుంచి వినతుల స్వీకరణ 5,400 కోట్ల రూపాయల విద్యుత్ భారాన్ని ప్రజలపై మోపెందుకు ప్రభుత్వం కుట్ర. సైడ్ కాలువలు ధ్వంసం మాకేం పట్టదంటున్నట్లు వ్యవహరిస్తున్న మున్సిపల్ సిబ్బంది... ప్రముఖ నటుడు తనికెళ్ల భరణికి అరుదైన గౌరవం.. ఘనంగా భజరప్ప స్మారక పురస్కార ప్రదానం మానవత్వం చాటిన త్రిపురాంతకం తహసిల్దార్ వాసుదేవరావు..... గుమ్మనూరు కుటుంబ సభ్యులను మర్యాదపూర్వకంగా కలిసిన పామిడి సీఐ పుష్పగుచ్ఛం అందజేసిన నూతన సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ మనోహర్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన కంగనా రనౌత్.. ఏఐ ఫేక్ కంటెంట్‌పై సంచలన పిటిషన్ *ఓటు హక్కుపై గళమెత్తిన కాంగ్రెస్‌*

ప్ర‌జ‌లు నేరుగా వాట్సాప్ లో ఫిర్యాదులు చేసే అవ‌కాశం - ప్ర‌జ‌లు ఈ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌న్న మంత్రి జూప‌ల్లి

Select Suryaa Now
ప్ర‌జ‌లు నేరుగా వాట్సాప్ లో ఫిర్యాదులు చేసే అవ‌కాశం - ప్ర‌జ‌లు ఈ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌న్న మంత్రి జూప‌ల్లి
-  ప్రభుత్వ సేవలు ప్రజలకు సులభంగా అందించేలా చర్యలు - మంత్రి జూప‌ల్లి ఆదేశాల‌తో ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లా క‌లెక్ట‌ర్ కార్యాల‌యాల్లో ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ -  మంత్రి పేషీ, క‌లెక్ట‌ర్ కార్యాల‌యాల్లో ప్ర‌త్యేక వాట్సాప్ నంబ‌ర్లు
సూర్య ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి : ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జ్ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు ఆదేశాల‌తో ప్రభుత్వ సేవలపై ఫిర్యాదులకు ఇకపై ఎక్కడికి తిరగాల్సిన అవసరం లేకుండా సరికొత్త సదుపాయం అందుబాటులోకి రానుంది.  వాట్సాప్‌లో ప్రభుత్వ సేవలపై ఫిర్యాదు చేసేందుకు అవకాశం కల్పించాలని మంత్రి జూప‌ల్లి కృష్ణారావు క‌లెక్ట‌ర్ల‌కు ఈ మేర‌కు దిశానిర్ధేశం చేశారు.  ఈ నేప‌థ్యంలో ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలోని 4 క‌లెక్ట‌రేట్ల‌లో ప్రజా ఫిర్యాదుల వ్యవస్థను (ప్రత్యేక గ్రీవెన్స్ సెల్)  ఏర్పాటు చేశారు. ప్రజలు తమ ఫిర్యాదులు, వినతుల కోసం  కలెక్టరేట్‌కు రావాల్సిన అవసరం లేకుండా, ఇంటి వద్ద నుంచే తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లేలా వాట్సాప్  సేవ‌ల‌ను  క‌లెక్ట‌ర్లు అందుబాటులోకి తెచ్చారు. హైద‌రాబాద్ లోని మంత్రి జూప‌ల్లి పేషిలోనూ ఈ సేవ‌ల‌ను వినియోగించుకోవ‌చ్చు. ప్రజల నుంచి వచ్చే ప్రతి ఫిర్యాదును సంబంధిత అధికారులు పరిశీలించి, సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని మంత్రి జూపల్లి కృష్ణారావు ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. ఫిర్యాదులను సంబంధిత శాఖలకు పంపించడంతో పాటు, వాటి పరిష్కారంపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని సూచించారు.
-  వాట్సాప్‌ నంబర్లు:  మంత్రి జూపల్లి కృష్ణారావు పేషీ: 8500689596, ఆదిలాబాద్‌ కలెక్టరేట్‌: 9492341947,  నిర్మల్‌ కలెక్టరేట్‌: 8317557897, కుమ్రంభీం ఆసిఫాబాద్‌ కలెక్టరేట్‌: 7569986036, మంచిర్యాల కలెక్టరేట్‌: 9492123642 . 
ప్రజలు ఈ వాట్సాప్‌ నంబర్లను వినియోగించుకుని తమ సమస్యలను నేరుగా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువచ్చి, సత్వర పరిష్కారం పొందాలని మంత్రి కోరారు.ఉమ్మ‌డి జిల్లా ప్రజలు తమ ఫిర్యాదులను వాట్సాప్ నంబర్ల‌కు మెసేజ్ రూపంలో పంపవచ్చని క‌లెక్ట‌ర్లు తెలిపారు. ఫిర్యాదుతో పాటు సమస్యకు సంబంధించిన పూర్తి వివరాలు, సమస్య ఉన్న ప్రదేశం, చిరునామా, అవసరమైన ఆధారాలు, ఫొటోలు పంపించాలని సూచించారు.