BREAKING
కోవూరు మండలంలో పలువురు వైసీపీ నాయకులను పరామర్శించిన మాజీ మంత్రి నల్లపరెడ్డి.. ప్రజా ఆస్తుల పరిరక్షణకు నంద్యాలలో "ప్రజా భిక్షాటన"-విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చిన అఖిలపక్షం నాయకులు డిఎస్ఆర్ హైస్కూల్ లో ఉపాధ్యాయులు ,విద్యా కమిటీ,పేరెంట్స్ తో మంత్రి నారాయణ ఆత్మీయ సమావేశం. న్యాయవాదుల రక్షణ చట్టం అమలు చేయాలి కనకదుర్గమ్మ ఆలయంలో దసరా మహోత్సవాలు. తాను పక్కా సెక్యులరిస్టును.. సైనికులే అసలైన రియల్ హీరోలు: ప్రముఖ నటుడు సుమన్ సంచలన వ్యాఖ్యలు టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి లోకేష్ ప్రజాదర్బార్ ప్రజలు, టీడీపీ కార్యకర్తల నుంచి వినతుల స్వీకరణ 5,400 కోట్ల రూపాయల విద్యుత్ భారాన్ని ప్రజలపై మోపెందుకు ప్రభుత్వం కుట్ర. సైడ్ కాలువలు ధ్వంసం మాకేం పట్టదంటున్నట్లు వ్యవహరిస్తున్న మున్సిపల్ సిబ్బంది... ప్రముఖ నటుడు తనికెళ్ల భరణికి అరుదైన గౌరవం.. ఘనంగా భజరప్ప స్మారక పురస్కార ప్రదానం మానవత్వం చాటిన త్రిపురాంతకం తహసిల్దార్ వాసుదేవరావు..... గుమ్మనూరు కుటుంబ సభ్యులను మర్యాదపూర్వకంగా కలిసిన పామిడి సీఐ పుష్పగుచ్ఛం అందజేసిన నూతన సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ మనోహర్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన కంగనా రనౌత్.. ఏఐ ఫేక్ కంటెంట్‌పై సంచలన పిటిషన్ *ఓటు హక్కుపై గళమెత్తిన కాంగ్రెస్‌* ఉద్యోగం చేస్తూనే ఉన్నత విద్యలో మెరిసిన ప్రశాంత్ - బిఆర్ఎవోయు స్నాతకోత్సవంలో బంగారు పతకం

త్వరలో...హకీంపేట్ నందు వ్యవసాయ అనుబంధ శాఖ లు మరియు పరిశ్రమల శాఖ లు ఎక్స్ పో వేదిక...

Select Suryaa Now
త్వరలో...హకీంపేట్ నందు వ్యవసాయ అనుబంధ శాఖ లు మరియు పరిశ్రమల శాఖ లు ఎక్స్ పో  వేదిక...

స్థలం పరిశీలన చేసిన జిల్లా కలెక్టర్ దీపక్ తివారి, ఎస్పీ స్నేహ మెహ్ర...

దుద్యాల్ , మేజర్ న్యూస్: మండల పరిధిలో ని హకీంపేట్ గ్రామ శివారులో వ్యవసాయ అనుబంధ శాఖ ల  మరియు పరిశ్రమల శాఖ కు సంబంధించిన ఎక్స్ పో వేదికను ఏర్పాటు చేసేందుకు అధికారులు కసరత్తు చేటున్నారు. అందులో భాగంగానే గురువారం అందుకు సంబంధించి స్థల పరిశీలనను టీ జి ఐ ఐ సి అధికారి వీరా రెడ్డి, జిల్లా కలెక్టర్ దీపక్ తివరి, జిల్లా ఎస్ పి స్నేహ మెహర లతో కలిసి పరిశీలించారు. ఈ వేదికలో రైతులకు వ్యవసాయం, ఉద్యానవన రంగాల్లో ఆధునిక సాగు పద్ధతులు, నూతన సాంకేతిక పరిజ్ఞానం, అధిక దిగుబడుల సాధన, ప్రభుత్వ పథకాలు, మార్కెటింగ్ మరియు పరిశ్రమల అవకాశాలపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో  వ్యవసాయ మరియు పరిశ్రమల ఎక్స్ పో ను నిర్వహించేందుకు  సన్నాహాలు చేస్తున్నారు. ఈ వేదికలో  సందర్శించే ప్రముఖ పారిశ్రామిక  వేత్తలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన మౌలిక వసతులు, రైతుల రాకపోకలు, పార్కింగ్, తాగునీరు, విద్యుత్, ప్రదర్శన స్టాళ్లు తదితర అంశాలను  పరిశీలించారు.రైతులకు వ్యవసాయ, ఉద్యానవన, మరియు పరిశ్రమల రంగాలకు సంబంధించిన తాజా సాంకేతికత, నూతన విధానాలు, ప్రభుత్వ ప్రోత్సాహకాలు మరియు వివిధ పథకాలపై సమగ్ర అవగాహన కల్పించేలా పరిశ్రమ ల ఎక్స్ పో ను విజయవంతంగా నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ తెలిపారు.
ఈ కార్యక్రమం లో డి సి శేష గిరి రావు,కాడ ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డి, ఆర్ డి ఓ అనిత,  వ్యవసాయ శాఖ అధికారులు మేరీ రేఖ, కవిత, హార్టీ కల్చర్ సత్తార్,  డీస్పీ శ్రీనివాస్, తహసీల్దార్ కిషన్, ఇంజనీర్ లు,  సంబంధిత అధికారులు తదితరులు ఉన్నారు.

రిపోర్టర్:రమేష్, దుద్యాల్, వికారాబాద్ జిల్లా.