విద్యార్థుల ఉన్నతికి అండగా ఉంటాం
విద్యార్థుల ఉన్నతికి అండగా ఉంటాం
-పాఠశాల విద్యార్థులకు బూట్లు పంపిణీ
-నారాయణరావుపేట సర్పంచ్ ఎల్లారెడ్డి
సిద్దిపేట రూరల్ : విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని, కష్టపడి చదివి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని నారాయణరావుపేట గ్రామ సర్పంచ్ ఎల్లారెడ్డి అన్నారు.గురువారం నారాయణరావుపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు నాగరాజు, ఉపాధ్యాయులతో కలిసి విద్యార్థులకు బూట్లను సర్పంచ్ ఎల్లారెడ్డి పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులే రేపటి సమాజానికి మార్గదర్శకులని, ప్రతి ఒక్కరూ బాగా చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు అవసరమైన సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తామన్నారు.పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చదువుకొని తల్లిదండ్రులకు,గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది వేయడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని, వారి అభివృద్ధికి గ్రామ ప్రజాప్రతినిధులుగా ఎల్లప్పుడూ అండగా ఉంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
(సిద్దిపేట రూరల్ రమేష్)