BREAKING
కోవూరు మండలంలో పలువురు వైసీపీ నాయకులను పరామర్శించిన మాజీ మంత్రి నల్లపరెడ్డి.. ప్రజా ఆస్తుల పరిరక్షణకు నంద్యాలలో "ప్రజా భిక్షాటన"-విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చిన అఖిలపక్షం నాయకులు డిఎస్ఆర్ హైస్కూల్ లో ఉపాధ్యాయులు ,విద్యా కమిటీ,పేరెంట్స్ తో మంత్రి నారాయణ ఆత్మీయ సమావేశం. న్యాయవాదుల రక్షణ చట్టం అమలు చేయాలి కనకదుర్గమ్మ ఆలయంలో దసరా మహోత్సవాలు. తాను పక్కా సెక్యులరిస్టును.. సైనికులే అసలైన రియల్ హీరోలు: ప్రముఖ నటుడు సుమన్ సంచలన వ్యాఖ్యలు టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి లోకేష్ ప్రజాదర్బార్ ప్రజలు, టీడీపీ కార్యకర్తల నుంచి వినతుల స్వీకరణ 5,400 కోట్ల రూపాయల విద్యుత్ భారాన్ని ప్రజలపై మోపెందుకు ప్రభుత్వం కుట్ర. సైడ్ కాలువలు ధ్వంసం మాకేం పట్టదంటున్నట్లు వ్యవహరిస్తున్న మున్సిపల్ సిబ్బంది... ప్రముఖ నటుడు తనికెళ్ల భరణికి అరుదైన గౌరవం.. ఘనంగా భజరప్ప స్మారక పురస్కార ప్రదానం మానవత్వం చాటిన త్రిపురాంతకం తహసిల్దార్ వాసుదేవరావు..... గుమ్మనూరు కుటుంబ సభ్యులను మర్యాదపూర్వకంగా కలిసిన పామిడి సీఐ పుష్పగుచ్ఛం అందజేసిన నూతన సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ మనోహర్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన కంగనా రనౌత్.. ఏఐ ఫేక్ కంటెంట్‌పై సంచలన పిటిషన్ *ఓటు హక్కుపై గళమెత్తిన కాంగ్రెస్‌* ఉద్యోగం చేస్తూనే ఉన్నత విద్యలో మెరిసిన ప్రశాంత్ - బిఆర్ఎవోయు స్నాతకోత్సవంలో బంగారు పతకం

ప్రజల సమస్యల పరిస్కారం కోసం వాట్సాప్ గ్రీవెన్స్ సెల్ ప్రారంభం - జిల్లా కలెక్టర్ రాజర్షిషా

Select Suryaa Now
ప్రజల సమస్యల పరిస్కారం కోసం వాట్సాప్ గ్రీవెన్స్ సెల్ ప్రారంభం - జిల్లా కలెక్టర్ రాజర్షిషా
సూర్య ఆదిలాబాద్ ప్రతినిధి : జిల్లా ప్రజల సమస్యలను సులభంగా, వేగంగా పరిష్కరించేందుకు ప్రత్యేక వాట్సాప్ గ్రీవెన్స్ సెల్ అందుబాటులోకి తీసుకువచ్చినట్లు జిల్లా కలెక్టర్ రాజర్షిషా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.ప్రజలు తమ ఫిర్యాదులు, వినతుల కోసం ప్రతిసారీ కలెక్టరేట్‌కు రావాల్సిన అవసరం లేకుండా, ఇంటి వద్ద నుంచే తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లేలా ఈ డిజిటల్ వేదికను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ పేర్కొన్నారు.జిల్లా ప్రజలు తమ ఫిర్యాదులను వాట్సాప్ నంబర్ 9492341947 కు మెసేజ్ రూపంలో పంపవచ్చని తెలిపారు. ఫిర్యాదుతో పాటు సమస్యకు సంబంధించిన పూర్తి వివరాలు, సమస్య ఉన్న ప్రదేశం, చిరునామా, అవసరమైన ఆధారాలు, ఫొటోలు పంపించాలని సూచించారు.ప్రజల నుంచి అందే ప్రతి ఫిర్యాదును ప్రత్యేక బృందం నమోదు చేసి, వెంటనే సంబంధిత శాఖాధికారులకు పంపిస్తుందని తెలిపారు. ఫిర్యాదుల పరిష్కార పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, నిర్ణీత కాలపరిమితిలో సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు.జిల్లా ప్రజలు ఈ వాట్సాప్ గ్రీవెన్స్ సెల్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రజా సమస్యలు, ప్రభుత్వ సేవలకు సంబంధించిన ఫిర్యాదులను మాత్రమే ఈ నంబర్‌కు పంపించాలని, అనవసరమైన లేదా తప్పుడు సందేశాలను పంపవద్దని సూచించారు.9492341947 నంబర్‌ను కేవలం వాట్సాప్ సేవల కోసం మాత్రమే వినియోగించాలని, ఈ నంబర్‌కు ఫోన్ కాల్స్ చేయరాదని జిల్లా కలెక్టర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.