గట్టు పై ఘాట్ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన
హుజూర్ నగర్ రూరల్, మేజర్ న్యూస్ :
మండల పరిధిలోనిలింగగిరి గ్రామలో ఉన్న పెద్ద గట్టు పై గల శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానమును పూర్వము దుండగులచే ధ్వంసం చేయబడి ఎటువంటి ఆదరణ లేకుండా జీర్ణోద్ధరణలో ఉన్న దేవాలయమును పునఃనిర్మాణము చేయుటకు భక్తుల సహకారముతో పెద్దగట్టు పైకి ఘాటు రోడ్డు నిర్మాణ పనులకు బుధవారం శంకుస్థాపన చేయడం జరిగింది. కార్యక్రమములో సీతారామచంద్రస్వామి ఆలయ చైర్మన్ నాగమళ్ల వీరబాబు, అర్చకులు ముడుంబ దామోదర చార్యులు,గ్రామ ఉప సర్పంచ్ చలమల సతీష్,మాజీ జెడ్ పి టి సి ఆఫీజా నిజాముద్దీన్,గ్రామ పెద్దలు చలమల రాఘవయ్య, మంత్రి ప్రగడ రాఘవరావు,భీమిశెట్టి, రామారావు, కాసర్ల నాగేశ్వర్ రావు, రిటైర్డ్ హెడ్ మాస్టర్ అంకతి అప్పయ్య, రిటైర్డ్ కస్టమ్స్ అస్సిస్టెంట్ డైరక్టర్ చందా సుధాకర్ రెడ్డి,బాల వెంకటేశ్వర్లు, కాంట్రాక్టర్ బాల్ రెడ్డి ఆలయ ఈవో కూన్ రెడ్డి కొండారెడ్డి పాల్గొన్నారు.