BREAKING
గట్టు పై ఘాట్ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన మున్సిపల్ కార్మికుల వేతనాల చెల్లింపులో ప్రతి నెల లక్షల రూపాయల స్కాం స్థలాల కోసం బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు బంజేయ్.. సాధారణ ఆడియో లాంచ్‌కు దూరంగా జైలర్ 2 టీమ్.. ఓటీటీలో గ్రాండ్‌గా సూపర్ షో ప్రసారం! పార్టీ ఐడీ కార్డు అందుకున్న బీసీ సెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్ మైసమ్మ ఆలయ నిర్మాణానికి మల్లేశం రూ.21 వేల విరాళం మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ పిలుపు కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ . రికార్డు స్థాయి డిమాండ్.. అయినా నాణ్యమైన విద్యుత్ సరఫరా: భట్టి తాండూర్ కిచ్చన్నపేట సొసైటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం. రైతుల వడ్ల కొనుగోళ్లకు అడ్డంకులు సృష్టించొద్దు వెల్దుర్తి సీహెచ్‌సీలో అక్టోబర్ 9న మెగా వైద్య శిబిరం: మెడికల్ ఆఫీసర్ డాక్టర్ బాలచంద్రారెడ్డి జగ్గయ్యపేట మున్సిపాలిటీ పై వైస్సార్ సీపీ జెండా ఎగరడం కాయం... పీటీ ఉష 42 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన అథ్లెట్ విత్య రామరాజ్ ను అభినందించిన హీరో ధనుష్! మోదీ 25 ఏళ్ల సుదీర్ఘ ప్రజా జీవితంపై ఏపీ కేబినెట్ కీలక తీర్మానం: చంద్రబాబు ప్రశంసలు సీఎం చంద్రబాబుతో మంత్రి నారాయణ భేటీ: రాజధాని భూములపై కీలక చర్చ

టి. నర్సాపురంలో పేద విద్యార్థులకు నోట్‌బుక్స్ పంపిణీ

Select Suryaa Now
టి. నర్సాపురంలో పేద విద్యార్థులకు నోట్‌బుక్స్ పంపిణీ

టి. నర్సాపురం, మేజర్ న్యూస్: బంజారా భజరంగీ భేరి, ట్రేస్ ఇండియా సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో టి. నర్సాపురం మండలంలోని ప్రకాష్ నగర్, రుద్రకోట, రాజుగూడెం గ్రామాల్లోని ప్రాథమిక పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో విద్యార్థులకు నోట్‌బుక్స్ పంపిణీ చేశారు.ట్రేస్ ఇండియా ప్రతినిధి షేక్ ముస్తాఫా అలీ మాట్లాడుతూ గ్రామీణ పేద విద్యార్థులకు విద్యలో సహకారం అందించి వారి జీవితాల్లో వెలుగులు నింపాలనే లక్ష్యంతో విద్యా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. బంజారా భజరంగీ భేరి జిల్లా నాయకులు భూక్యా నాగరాజు నాయక్ విద్యాదానం గొప్పదని పేర్కొన్నారు. భూక్యా వేణుగోపాల్ విద్యార్థులు ఇష్టపడి చదివి ప్రాథమిక విద్యలో బలమైన పునాదులు వేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, అంగన్‌వాడీ టీచర్లు, సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

 పసుమర్తి రాము జిల్లా ఇంచార్జ్ ఏలూరు