BREAKING
లారీల రాకపోకలపై నియంత్రణకు చర్యలు తీసుకోవాలి గుంతకల్లు డీఎస్పీకి ఎస్‌ఎఫ్‌ఐ వినతి గుర్రపు శ్రీనివాస్‌ కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్‌ఎస్‌ నాయకులు మీ కళ్లను ప్రేమించండి… కళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకోండి” కోవూరు మండలంలో పలువురు వైసీపీ నాయకులను పరామర్శించిన మాజీ మంత్రి నల్లపరెడ్డి.. ప్రజా ఆస్తుల పరిరక్షణకు నంద్యాలలో "ప్రజా భిక్షాటన"-విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చిన అఖిలపక్షం నాయకులు డిఎస్ఆర్ హైస్కూల్ లో ఉపాధ్యాయులు ,విద్యా కమిటీ,పేరెంట్స్ తో మంత్రి నారాయణ ఆత్మీయ సమావేశం. న్యాయవాదుల రక్షణ చట్టం అమలు చేయాలి కనకదుర్గమ్మ ఆలయంలో దసరా మహోత్సవాలు. తాను పక్కా సెక్యులరిస్టును.. సైనికులే అసలైన రియల్ హీరోలు: ప్రముఖ నటుడు సుమన్ సంచలన వ్యాఖ్యలు టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి లోకేష్ ప్రజాదర్బార్ ప్రజలు, టీడీపీ కార్యకర్తల నుంచి వినతుల స్వీకరణ 5,400 కోట్ల రూపాయల విద్యుత్ భారాన్ని ప్రజలపై మోపెందుకు ప్రభుత్వం కుట్ర. సైడ్ కాలువలు ధ్వంసం మాకేం పట్టదంటున్నట్లు వ్యవహరిస్తున్న మున్సిపల్ సిబ్బంది... ప్రముఖ నటుడు తనికెళ్ల భరణికి అరుదైన గౌరవం.. ఘనంగా భజరప్ప స్మారక పురస్కార ప్రదానం మానవత్వం చాటిన త్రిపురాంతకం తహసిల్దార్ వాసుదేవరావు..... గుమ్మనూరు కుటుంబ సభ్యులను మర్యాదపూర్వకంగా కలిసిన పామిడి సీఐ పుష్పగుచ్ఛం అందజేసిన నూతన సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ మనోహర్

అర్హులైన లబ్ధిదారులందరికీ స్మార్ట్ రేషన్ కార్డులు:సర్పంచ్ లావణ్య మోహన్

Select Suryaa Now
అర్హులైన లబ్ధిదారులందరికీ స్మార్ట్ రేషన్ కార్డులు:సర్పంచ్ లావణ్య మోహన్

మోమిన్‌పేట్, మేజర్ న్యూస్:
అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని దుర్గం చెరువు గ్రామ సర్పంచ్ లావణ్య మోహన్ తెలిపారు. రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆదేశాల మేరకు గ్రామంలో రేషన్ కార్డులు లేని అర్హులైన లబ్ధిదారులను గుర్తించి స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేసినట్లు ఆమె పేర్కొన్నారు.బుధవారం మోమిన్‌పేట్ మండల పరిధిలోని దుర్గం చెరువు గ్రామంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామ పంచాయతీ సిబ్బందితో కలిసి సర్పంచ్ లావణ్య మోహన్ అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా గ్రామస్థాయిలో నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న స్మార్ట్ రేషన్ కార్డులను అర్హులైన ప్రతి కుటుంబానికి అందించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి లక్ష్మి, జీపీఓ వెంకట్‌రెడ్డి, మోమిన్‌పేట్ పీఏసీఎస్ డైరెక్టర్ సత్యనారాయణగౌడ్, మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎల్.కృష్ణ, ఏఎంసీ డైరెక్టర్ బంటు వెంకటేశం, ఉపసర్పంచ్ సరియాబీ, పంచాయతీ వార్డు సభ్యులు, పంచాయతీ సిబ్బంది, రేషన్ డీలర్లు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

రిపోర్టర్: వడ్ల మాణిక్యం చారి, మోమిన్ పేట్, వికారాబాద్ జిల్లా.