కళాశాలకు ఇన్వర్టర్ సిస్టం బహుకరణ
ఉండి, మేజర్ న్యూస్: ఉండి మండలం యండగండి గ్రామంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలకు ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో క్లబ్ అధ్యక్షుడు ద్వారంపూడి నారాయణరెడ్డి ఆర్థిక సహాయంతో సమకూర్చిన అధునాతన ఇన్వర్టర్ సిస్టమును లయన్స్ జిల్లా పూర్వ గవర్నర్,లయన్ డాక్టర్ ఎం వి సత్యనారాయణ రాజు చేతుల మీదుగా ప్రిన్సిపాల్ రమా ప్రియకు అందించడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ ఎం వి సత్యనారాయణ రాజు మాట్లాడుతూ విద్యుత్ కోతలు వల్ల కళాశాల విద్యార్థులు ఇబ్బంది పడకూడదని కళాశాలలో ఆఫీస్ పనులు ఆగిపోకూడదని క్లబ్ అధ్యక్షుడు నారాయణరెడ్డి ఆర్థిక సహకారంతో ఇన్వర్టర్ సమకూర్చడం అభినందనీయమన్నారు. సమాజంలోని అవసరాలను గుర్తించి ఉండి లయన్స్ క్లబ్ చేస్తున్న సేవా కార్యక్రమాలను ఆయన కొనియాడారు. అనంతరం క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు నారాయణరెడ్డి, రుద్రరాజు నరసరాజు మాట్లాడుతూ ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాలు కల్పనకు ఉండి లయన్స్ క్లబ్ ఎప్పుడూ ముందుంటుందని ఉండి మండల పరిధిలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్నో మౌలిక వసతులు కల్పించామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎల్సిఐఎఫ్ కోఆర్డినేటర్ గాదిరాజు రంగరాజు, రీజియన్ సెక్రటరీ సత్తి బ్రహ్మారెడ్డి, కోశాధికారి కన్నెగంటి రూత్ కళ, భూపతిరాజు హరినాథ్ రాజు, వేగేశ్న అనంతలక్ష్మి, కాగిత మహంకాళి, క్లబ్ ఉపాధ్యక్షుడు పెనుమచ్చ రంగ ప్రసాద్ రాజు తదితరులతోపాటు కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా మాజీ గవర్నర్ ఎంవీ సూర్యనారాయణ రాజు, క్లబ్ అధ్యక్షుడు పారిశ్రామికవేత్త ద్వారంపూడి నారాయణరెడ్డిని కళాశాల యాజమాన్యం సాలువాలు కప్పి పూలమాలలతో ఘనంగా సత్కరించడం జరిగింది.
రిపోర్టర్ రాజు ఉండి పశ్చిమగోదావరి జిల్లా